ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. వివాహయోగం..! 26-03-2023 నుంచి 01.04.2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

మేష రాశి:- శుభకార్యములను ఆచ‌రింతురు. పట్టుదలతో వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులు ఆటంకాలు కలిగిననూ విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తారు. పెద్దల అండదండలు లభిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ద‌త్తాత్రేయస్వామి ఆరాధన శుభములను కలుగచేస్తుంది. వృష‌భ రాశి:- దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉప‌శమనం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యనిర్వహణ సామర్థ్యమును ప్రదర్శిస్తారు. పండితులు కవులు నూతన గ్రంథరచనలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల ఆదరణ […]

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. వివాహయోగం..! 26-03-2023 నుంచి 01.04.2023 వ‌ర‌కు వార రాశి ఫ‌లాలు

మేష రాశి:- శుభకార్యములను ఆచ‌రింతురు. పట్టుదలతో వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులు ఆటంకాలు కలిగిననూ విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తారు. పెద్దల అండదండలు లభిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ద‌త్తాత్రేయస్వామి ఆరాధన శుభములను కలుగచేస్తుంది.

వృష‌భ రాశి:- దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉప‌శమనం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యనిర్వహణ సామర్థ్యమును ప్రదర్శిస్తారు. పండితులు కవులు నూతన గ్రంథరచనలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. నిద్రా సౌఖ్యం తక్కువ. ఆంజనేయస్వామి ఆరాధన శుభమును కలిగిస్తుంది.

మిథున రాశి:- పెద్దలతో విరోదములు ఏర్పడకుండా చూసుకోండి. అపకీర్తి కలుగుతుంది. బహుముఖ ధనవ్యయము కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం శ్రేయస్కరం కాదు. స్థిరాస్థి మూలక అశాంతి క‌లుగవచ్బును. సన్నిహిత వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం కలుగవచ్చును. కళాకారులు వివాదాలలో చిక్కుకుందూరు. శివారాధన శ్రేయస్సు నిస్తుంది.

కర్కాటక రాశి:- తల్లి దండ్రుల అనారోగ్యం అశాంతిని కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయము కలుగవచ్చును. భూ, గృహలాభాములున్ననూ కొంత ఆలస్యము కావచ్చును. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపార ఆరంభ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ఆటంకములు కలిగినన్ను వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతల నిర్వహిస్తారు.

సింహ రాశి:- కోపం వలన కార్యవిఘ్నాలు కలుగుతాయి. ప్రయాణ మూలక అసౌకర్యములు కలుగుతాయి. దూర్వార్తా శ్ర‌వణ‌ము కలుగవచ్చును. శ‌త్న‌త్వ‌ము పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువ కావడం వలన బలహీనతలు కలుగవచ్చును. సహచరులపై ద్వేషము పెంచుకోకండి. తొందరపాటు పనికిరాదు. విష్ణు ఆరాధన శుభములను కలిగిస్తుంది.

కన్యా రాశి:- చిక్కులన్నీ క్రమముగా తొలగిపోతాయి. విద్యార్థులు సద్గోష్టిలో పాల్గొన‌డం వ‌ల‌న ఉల్లాసంగా వుంటారు. శుభకార్యమూలక ప్ర‌య‌ణాలు వుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ మందు శుభకార్యాలు జరుపు విషయమై ఆలోచనలు సాగుతాయి. రాద‌నుకున్న ధనము చేతికందుతుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. లలితాదేవి ఆరాధన మరింత శుభములనిస్తుంది.

తులా రాశి:- ఔషధ సేవనము చేయవలసి రామచ్చును. ఆకార‌ణ కలహ‌ములు బాధిస్తాయి. ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా వుంటుంది. అనుకొని ఇబ్బందులు వ‌ల‌న మ‌నఃక్లేశానికి గురౌతారు. కుంటుంబ స‌భ్యుల‌పై అప‌వాదులు బాధ క‌లిగిస్తాయి. ఋణ మూల‌క అశాంతి క‌లుగుతుంది. శ‌త్న‌బాధ‌లుంటాయి. శివ‌రాధ‌న కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

వృశ్చిక రాశి:- సాహ‌స‌ముతో స‌నులు పూర్తివుతాయి. పెద్ద‌ల ఆద‌ర‌ణ ఇబ్బందుల‌ను దూరం చేస్తుంది. త‌ల్లి దండ్రుల ఆశీస్సులుంటాయి. నేత‌న ప‌రిచ‌యాలు క‌లుగుతాయి. ప్ర‌య‌ణ‌ములులో ఆటంకాలు ఎక్కువౌతాయి. ఒక‌చో వాహ‌న ప్ర‌మాద‌ములు క‌లుగ‌వ‌చ్చును. తొంద‌ర‌పాటు ప‌నికి రాదు. సుబ్ర‌హ్మ‌ణ్య ఆరాధ‌న మ‌నోస్ధైర్యాన్నిస్తుంది.

ధనుస్సు రాశి: – ప్రముఖులతో పరిచయం సంతోషాన్నిస్తుంది. దూరప్రాంతాలు నుంచి శుభ స‌మాచారం ల‌భిస్తుంది. బందుమిత్రుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప‌రోప‌కారముతో గౌర‌వాన్ని పొందుతారు. వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. సంఘంలో పరపతిని పొందుతారు. శరీరము ఉల్లాసంగా వుంటుంది. దుర్గా ఆరాధన మరిన్ని శుభాలనిస్తుంది.

మకర రాశి:- మోస‌గాళ్ళ బారిన ప‌డ‌కుండా జాగ్రత్త వహించండి. అతి కోప‌ము అన‌ర్థాలకు దారి తీస్తుందని గుర్తించుకోండి. వృత్తి యందు చిక్కులు కలుగుతాయి. బందుమిత్రు వియోగ‌ములు క‌లుగ‌వ‌చ్చును. ఆకార‌ణ క‌ల‌హ‌ములు బాధిస్తాయి. ఆక‌స్మిక ప్ర‌మాదాలు కలుగవచ్చును. మోకాళ్ళనొప్పులు, కడుపునొప్పి వేండ‌వ‌చ్చును. లక్ష్మీ నారాయణుల ఆరాధన మనశ్శాంతినిస్తుంది.

కుంభ రాశి:- శత్రువులు పెరుగుతారు. సోదరులతో, అభిప్రాయ భేదాలు రావచ్చును. శ‌రీర బలహీనతలుంటాయి. ఎముకలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగవచ్చును. ప్రయత్నా కార్యాలలో ప్రతికూల ఫలితాలు వుండవచ్చును. మిత్రద్రోహములు మనశ్శాంతిని పొగొడతాయి. ఆకారణ‌ కలహములుండవచ్చను. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న చిక్కులను దూరం చేస్తుంది.

మీన రాశి:- వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన బాధ్యతలు నిర్వహించవలసి వుంటుంది. ప్రయత్నకార్యాలు నెరవేరుతాయి. ధనవ్వయము అధికంగా వుంటుంది. అవమానాలు ఎదురౌతాయి. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పాదములు, ఎముకల నొప్పుల బాధలుంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్తంగా చూసుకోవాలి. వెంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.