అరుదైన వ్యాధి బారిన.. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్‌?

విధాత‌: గతంలో గౌతమి, సోనాలి బింద్రే, లీసారాయ్, హంసా నందిని వంటి వారు క్యాన్సర్‌ను జయించారు. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అరుదైన వ్యాధితో చికిత్స పొందుతుందట. ప్రస్తుతం సమంత కూడా మయోసైటిస్‌తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు పొందిన ఎంతోమంది అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు. అందంగా కనిపించడానికి వారు వేసుకునే మేకప్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎంతో మంది ఇలా అరుదైన […]

  • Publish Date - February 15, 2023 / 05:32 PM IST

విధాత‌: గతంలో గౌతమి, సోనాలి బింద్రే, లీసారాయ్, హంసా నందిని వంటి వారు క్యాన్సర్‌ను జయించారు. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అరుదైన వ్యాధితో చికిత్స పొందుతుందట. ప్రస్తుతం సమంత కూడా మయోసైటిస్‌తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు పొందిన ఎంతోమంది అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు.

అందంగా కనిపించడానికి వారు వేసుకునే మేకప్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎంతో మంది ఇలా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు. సమంత మయోసైటిస్‌ అనే చర్మ వ్యాధి నుంచి బయట పడింది. ఇప్పుడు రేణు దేశాయ్ భావోద్వేగ పోస్ట్‌తో ఆమె కూడా ఓ వ్యాధితో బాధ పడుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాలో నటించిన ఆమె మళ్లీ ఆయన సరసనే ‘జానీ’ సినిమాలో చివరిగా నటించింది. 2009లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. 2012లో విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అఖీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రేణు దేశాయ్ హీరోయిన్ గా మాత్రమే కాదు డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తన మాతృభాష మరాఠీ చిత్రాలలో నటిస్తూ కొన్ని చిత్రాలు నిర్మిస్తూ డైరెక్షన్ చేస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలత లవణం పాత్రను పోషిస్తుంది. ఇది ఓ సామాజిక కార్యకర్త పాత్ర. సువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ తాజాగా త‌న ఆరోగ్య సమస్య గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. శ్రేయభిలాషులారా మీకో విషయం చెప్పాలి. చాలాకాలం నుంచి నేను గుండె ఇతర హెల్త్ సమస్యలతో బాధ పడుతున్నాను. బలం, ధైర్యం తెచ్చు కోవడానికి చాలా కష్టపడ్డాను. నాలాగే అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ధైర్యంగా నిలబడి వాటిని పాజిటివ్ ఎనర్జీతో ఎదుర్కోవాలని ఈ పోస్ట్ పెడుతున్నానని తెలిపింది.

ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యం కోల్పోవద్దు. ఏదో రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు. జీవితంతో పాటు మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం ఉండాలి. అలాంటి న‌మ్మకం మ‌న‌కు ముఖ్యం. జీవితంతో పాటు న‌మ్మ‌కాన్ని కోల్పోవ‌ద్దు.

ఈ ప్రపంచం మనకు ఎన్నో స‌ర్ ప్రైజ్‌ల‌ను ప్లాన్ చేసి ఉంచింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాటిని నవ్వుతూ స్వీకరించండి మళ్ళీ మామూలుగా అవడానికి నా వంతు ధైర్యంగా కృషి చేస్తున్నాను అని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.