ఎన్టీఆర్ కు నేతి పెసరట్టుకు అవినాభావ సంబంధం ఉందా?

  • By: sn    latest    Oct 08, 2023 11:54 AM IST
ఎన్టీఆర్ కు నేతి పెసరట్టుకు అవినాభావ సంబంధం ఉందా?

ఎన్టీఆర్ కు నేతి పెసరట్టుకు అవినాభావ సంబంధం ఉందా?తెలుగు సినీ చరిత్రలో చెరగని కీర్తి శిఖరం అంటే నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఎంతోమంది నటీనటులు ఆయన్ను తలుచుకుని.. ఆయనకు తమకు మధ్య జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. అలాంటి ఎన్నో విషయాల్ని పంచుకుంటున్నారు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ కు ఆహారం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలామందికి తెలుసు.

ఆయన ఎంత ఆహారం తిన్నా మళ్లీ వ్యాయమాలు చేసుకుని శరీరాన్ని చాలా ఫిట్ గా ఉంచేవారు. అలాంటి ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి 60 ఏళ్ల వయస్సులో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. జనాలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎంతో దృఢంగా నిశ్చయించుకుని మరీ వచ్చారు. అలాగే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని రాజకీయ నాయకుడిగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి కంటే ముందు ప్రతి ఊరు ప్రచార రథం పేరిట యాత్ర చేశారు. ఆయన కొడుకు హరికృష్ణ ఎన్టీఆర్ కు సహాయంగా ఉండేవారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రచారం సమయంలో అభిమానులు పెద్ద ఎత్తునే తరలి వచ్చేవారు. అలా ఓసారి ట్రైన్ జర్నీలో ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేవారు. ప్రతి స్టేషన్ లో ఆయనకు ఎంతో ఇష్టమైన నేతి పెసరట్లు పట్టుకుని మరీ ఎదురుచూశారు. అలా ఓ సారి రైలు మొదలైనప్పటి నుండి ఆ రైలు దిగేంత వరకు కూడా అభిమానులు ప్రేమతో తీసుకు వచ్చిన నేతి పెసరట్టు తింటూ వచ్చారట. అలా ఫస్ట్ నుండి చివరి వరకు ఏ అభిమానిని బాధ పెట్టకుండా అలా పెసరట్లు తిన్నారట. అంతటి పెద్ద నాయకుడు అభిమానులు చేసిన పెసరట్టు తినడంతో ప్రజలు చాలా ఆనందానికి గురయ్యేలా చేసింది. ఆ తర్వాత కొద్ది నెలలకే ఎన్నికలు రావడం ఆ తర్వాత తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను సీఎంగా గెలిపించడం జరిగాయి.