WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్..! నంబర్ సేవ్ చేయకుండానే మెసేజులు చేయొచ్చు
WhatsApp | ప్రముఖ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పు యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నది. ఈ క్రమంలోనే మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఎవరైనా కొత్త వ్యక్తులకు ఏదైనా మెస్సేజ్ చెసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మెస్సేజ్ చేయాలంటే తప్పనిసరిగా నంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టినట్లయ్యింది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా.. మరో వ్యక్తికి మెస్సేజ్ చేసేందుకు అవకాశం కలుగనున్నది. ఈ […]

WhatsApp | ప్రముఖ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పు యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నది. ఈ క్రమంలోనే మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఎవరైనా కొత్త వ్యక్తులకు ఏదైనా మెస్సేజ్ చెసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు మెస్సేజ్ చేయాలంటే తప్పనిసరిగా నంబర్‌ను సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టినట్లయ్యింది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా.. మరో వ్యక్తికి మెస్సేజ్ చేసేందుకు అవకాశం కలుగనున్నది. ఈ ఫీచర్ ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది.
వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి తర్వాత స్మార్ట్ న్యూ చాట్ బటన్ కనిపిస్తుది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏ నంబర్‌కు సందేశం పంపాలనుకుంటున్నారో ఆ నంబర్‌ను సెర్చ్‌బార్‌లో క్లిక్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ నంబర్‌ను సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తికి మెసేజ్‌చేసేలా ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అయితే, ఈ ఫీచర్‌పై వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
వాబీటా ఇన్ఫో ఫీచర్‌పై ప్రకటన చేసింది. ప్లేస్టోర్‌లో, యాప్ స్టోర్‌లో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో.. లేదో తెలుసుకోవచ్చు. ఇప్పటికే పలు ఫీచర్లను వాట్సాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరికీ వారు తమ వాట్సాప్ నంబర్‌కు మెస్సేజ్‌లను పంపుకునే వీలు కల్పించింది.