Chiranjeevi | Klin Kara |
‘నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు’ అనే సామెత తెలుసుకదా.. అచ్చం అలానే ఉంది.. చిరంజీవి ఇంటి పరిస్థితి. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళయిన పదకొండేళ్ళకు ఈ మధ్యనే సంతానం కలిగింది. ఇది చిరంజీవి కుంటుంబానికి పెద్ద సంబరం, అలాగే మెగా ఫ్యాన్స్ కూడా చాలా సంబరపడిపోయారు. మెగా ఫ్యామిలీతో పాటుగా సంబరాలు జరుపుకున్నారు. పుట్టిన పాపకు ‘క్లీం కారా’ అనే పేరు కూడా పెట్టారు.
పాప పేరు విషయంలో చాలా సస్పెన్స్ మెయింటైన్ చేసిన మెగా ఫ్యామిలీ, మొదట అంజలి అనే పేరు ఆంజనేయ స్వామిని ఉద్దేశించి పెట్ట బోతున్నారని అన్నారు కానీ తర్వాత అమ్మ వారి పేరుగా లలిత సహస్రనామాలలో నుంచి ‘క్లీం కారా’ అనే పేరును తీసుకుని పెట్టామని, ఉయ్యాలలో వేసిన రోజున చిరంజీవి, రామ్ చరణ్ తమ ట్విటర్ ఖాతాల్లో తెలియజేశారు. ఇక ఉపాసన అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే ఎక్కడా పాప ముఖాన్ని మీడియాకు కనిపించనీయ లేదు.
సరేలే రోజుల పిల్ల కదా దిష్టి తగులుతుందని చూపించడం లేదని అటు ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వ్యవహారం కాస్త ముదిరి ఇంట్లో వాళ్ళకు కూడా పిల్లను ఎత్తుకోవడానికి ఇవ్వడం లేదట. పైగా దిష్టి తగులుతుందని, ఫొటోలు అవీ కూడా తీయకూడదనే ఆంక్షలు పెట్టారట చరణ్, ఉపాసన దంపతులు. ఇంటికి పాపను చూసేందుకు వచ్చే బంధువుల విషయంలో అయితే మరికాస్త కఠినమైన ఆంక్షలే ఉన్నాయట. పాప దగ్గరకు వెళ్ళాలంటే చేతిలో సెల్ ఫోన్స్ తీసుకువెళ్ళ కూడదని, వచ్చే వారు శానిటైజర్ చేసుకుని కానీ పాప రూమ్ దగ్గరకు వెళ్ళకూడదని చెబుతున్నారట.
ఇదిలా ఉంటే పాపకు ఓ ప్రత్యేకమైన రూం కేటాయించి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారట. ఇలా బంధువుతోనే కాదు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తున్నారని, ఎందుకొచ్చిన గొడవని భార్యను తీసుకుని చిరంజీవి వెకేషన్‌కి విదేశాలకు వెళ్లిపోయాడనేలా టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.
ఇందులో నిజానిజాల పాళ్ళు ఎంత ఉందో తెలియదు కానీ, లేక లేక పిల్లలు పుడితే ఛాదస్తం ఉంటుంది కానీ మరీ ఇంతలానా.. అయినవాళ్ళను కూడా నొప్పించేలా ఉండకూడదని, మరీ ఇంత ఆర్భాటం అవసరం లేదని మెగా ఫ్యామిలీకి చెందిన సన్నిహితులు కొందరు చెవులు కొరుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే బయటివాళ్ళ వరకూ ఈ న్యూస్ రాకుండా చిరంజీవి కాస్త రిలాక్స్ అవడానికి భార్యతో సహా విదేశాలకు వెళ్లిపోయాడని చెప్పకుంటున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటని ఊరికే అన్నారా.. ఏది ఏమైనా మనవలు, మనవరాళ్ళ కోసం పదకొండేళ్ళుగా ఎదురు చూస్తున్న చిరంజీవి దంపతులకు ఎప్పుడు మనవరాలితో ఆడుకునే రోజు వస్తుందో మరి..