మునుగోడులో మెజార్టీని డిసైడ్ చేయనున్న.. ఆ 45 వేల ఓట్లు..?
Munugode by poll | విధాత: మునుగోడు ఉప ఎన్నికపైనే అందరి దృష్టి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ ఎన్నిక ఫలితం కోసం ఎదురు చూస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. మరి ఫలితం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు ఊపిరి బిగపట్టాల్సిందే. ఇక ఎవరూ ఊహించనంతగా, గత […]

Munugode by poll | విధాత: మునుగోడు ఉప ఎన్నికపైనే అందరి దృష్టి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ ఎన్నిక ఫలితం కోసం ఎదురు చూస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. మరి ఫలితం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు ఊపిరి బిగపట్టాల్సిందే. ఇక ఎవరూ ఊహించనంతగా, గత ఎన్నికల్లో కంటే అధికంగా పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 91.3 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు 93. 32 శాతం పోలింగ్ నమోదైంది.
మునుగోడు టీఆర్‌ఎస్‌దే?.. ప్రజల మనోగతం ఇదే! (విధాత ప్రత్యేక సర్వే నిజమైంది)
అయితే గెలుపు ఎవరిది అనేది ఎవరికి ఊహకు అందడం లేదు. అధికార పార్టీదే గెలుపు అని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే ఆరా అనే సంస్థ కూడా మునుగోడు ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను నిన్న వెల్లడి చేసింది. ఆ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని తెలిపింది.
టీఆర్ఎస్ పార్టీకి 50.82 శాతం ఓట్లు, బీజేపీకి 33.86 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 10.94 శాతం ఓట్లు, ఇతరులకు 4.38 శాతం ఓట్లు పోలైనట్లు పేర్కొంది. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకే అత్యధికంగా ఓట్లు పోలైనట్లు పేర్కొంది. కానీ కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఆ 45 వేల ఓట్లు మునుగోడులో గెలిచే అభ్యర్థి మెజార్టీని డిసైడ్ చేయనున్నాయి.
ఆరా సర్వే ప్రకారం.. చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం, పంతంగి, రెడ్డిబావి, ఆరేగూడెం, కట్రేవు, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 10,741 ఓట్లు ఉండగా, 10,134 ఓట్లు పోలయ్యాయి. ఈ గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలిపింది.
నారాయణపురం మండల పరిధిలోని గాంధీనగర్ తండా, నారాయణపురం, కొత్తగూడెం, జనగాం, వచ్యా తండా మజీరా జనగాం, బొటిమీది తండా, గంగాముల తండా, పుట్టపాక, వాయిళ్లపల్లి పోలింగ్ స్టేషన్లలో కూడా 11,587 ఓట్లకు గానూ 10,853 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు నివేదించారు.
చండూరు, గట్టుప్పల్ పరిధిలోని గట్టుప్పల్, జోగిగూడమజీరా దొనిపాముల, దొనిపాముల, నర్మెట, బంగారిగడ్డ, గొల్లగూడెం, తుమ్మలపల్లిల్లోనూ అధికార పార్టీకి, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉందని తెలిపింది. ఇక్కడ 11,516 ఓట్లకు గానూ 10,714 ఓట్లు పోలయ్యాయి.
మునుగోడు ఉప ఎన్నికపై రూ.1500 కోట్ల భారీ బెట్టింగ్ (ప్రత్యేక కథనం)
మర్రిగూడ, నాంపల్లి పరిధిలోని లెంకాలపల్లి, మెట్ చందాపూర్, ఇందుర్తి, గానుగుపల్లి, నర్సింహుల గూడెం, పెద్దాపురం, నవిళ్లగూడెం మజీరా పెద్దాపురం, నరేళ్లపల్లి, దామెర, స్వాములవారి లింగోటం, లక్ష్మాణపురం, నాంపల్లి, మహ్మదాపూర్, మహ్మదాపురం గ్రామాల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. మొత్తంగా పైన చెప్పిన గ్రామాల్లో 45 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లే పీఠం ఎవరిదో డిసైడ్ చేయనున్నాయి.
అన్ని మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకే లీడ్ వస్తుందని ఆరా సర్వే పేర్కొంది. బీజేపీకి కేవలం వావిళ్లపల్లి, గొల్లగూడెం, రాధానగర్ తండా, పొరాయిగడ్డ తండా, వాయిళ్లపల్లి, మర్రిబావి తండా, లచ్చమ్మగూడెం మజీరా చిల్లపురం, డాకు తండా, కొర్ర తండా, కాల్వలపల్లి, పులిపాలుపులా పోలింగ్ స్టేషన్ల పరిధిలో లీడ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అన్ని సర్వేలు అధికార పార్టీదే గెలుపు అని చెబుతున్నప్పటికీ, ఫలితం తేలే దాకా ఏ విషయం చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మునుగోడు ఫలితం రేపే.. మధ్యాహ్నం 1గంట కల్లా కౌంటింగ్ పూర్తి.
మండలాల వారీగా బూతుల వారీగా పోలైన ఓట్ల వివరాలు