లాఠీలకు, తూటాలకు ఎదురు నిలుస్తా.. మీ కోసం ప్రాణాలిస్తా: రేవంత్

విధాత: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసీఆర్‌ను గద్దె దింపాలన్నారు. రాష్ట్రానికి వస్తే తనకు రక్షణ కల్పించడం కోసం మోడీ కేంద్ర బలగాలను తెచ్చుకుంటే.. కేసీఆర్ రాష్ట్ర బలగాలను తెచ్చుకుంటు న్నాడని ఆరోపించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క […]

  • By: krs    latest    Oct 26, 2022 7:53 AM IST
లాఠీలకు, తూటాలకు ఎదురు నిలుస్తా.. మీ కోసం ప్రాణాలిస్తా: రేవంత్

విధాత: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసీఆర్‌ను గద్దె దింపాలన్నారు. రాష్ట్రానికి వస్తే తనకు రక్షణ కల్పించడం కోసం మోడీ కేంద్ర బలగాలను తెచ్చుకుంటే.. కేసీఆర్ రాష్ట్ర బలగాలను తెచ్చుకుంటు న్నాడని ఆరోపించారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని చెప్పారు. అటవీ, ప్రభుత్వ భూములపై కేసీఆర్ కుటుంబం కన్నేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవడొస్తాడో చూద్దాం.. కదన రంగంలో తేల్చుకుందాం.. కార్యకర్తలంతా మునుగోడుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. లాఠీలకు, తూటాలకు తాను ఎదురు నిలుస్తానని.. అవసరమైతే మీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నారు.

కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి కేంద్రానికి అమ్ముడు పోయాడని రేవంత్ ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు మంచి చేయకుండా మోసం చేసి పోయాడని అన్నారు. రాజగోపాల్ యువకుల వీపులపై కొడితే.. మునుగోడు ప్రజలు ఆయన గుండెలపై కొడతారని విమర్శించారు.

ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగున్నారని రాజగోపాల్‌ను ప్రశ్నించారు. పాల్వాయి స్రవంతికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని.. కార్యకర్తలే కాంగ్రెస్ జెండాను మోయాలని రేవంత్ రెడ్డి కోరారు.