పాద‌యాత్ర ఆప‌డంపై కోర్టుకు వెళ్తా: ష‌ర్మిల‌

విధాత‌: శాంతిభద్రతల సమస్య సృష్టించి పాదయాత్ర ఆపారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ రోజు మహిళా కమిషనర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు వాళ్ల ఇంట్లో మహిళలపై ఇలాగే మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు. మహిళా కమిషనర్‌ అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదు. అపాయింట్‌మెంట్‌ కోసం మూడు, నాలుగు రోజులు తిరగాల్సి వచ్చింది. పాదయాత్ర ఆపడంపై కోర్టుకు వెళ్తామన్నారు.

పాద‌యాత్ర ఆప‌డంపై కోర్టుకు వెళ్తా: ష‌ర్మిల‌

విధాత‌: శాంతిభద్రతల సమస్య సృష్టించి పాదయాత్ర ఆపారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ రోజు మహిళా కమిషనర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు వాళ్ల ఇంట్లో మహిళలపై ఇలాగే మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.

నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు. మహిళా కమిషనర్‌ అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదు. అపాయింట్‌మెంట్‌ కోసం మూడు, నాలుగు రోజులు తిరగాల్సి వచ్చింది. పాదయాత్ర ఆపడంపై కోర్టుకు వెళ్తామన్నారు.