జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ విశాఖ నుంచే పోటీ చేస్తారా!!
విధాత: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ మళ్లీ విశాఖ నుంచే పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నారంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి లోకేష్ తోడల్లుడు శ్రీభారత్, వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ చేయగా ఎంవివి గెలుపొందారు. అయితే ఆ తరువాత నుంచి జెడి లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉంటున్నా ఎక్కడా చడీ చప్పుడూ లేదు. ఎన్నికల అనంతరం ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే […]

విధాత: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ మళ్లీ విశాఖ నుంచే పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నారంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి లోకేష్ తోడల్లుడు శ్రీభారత్, వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ చేయగా ఎంవివి గెలుపొందారు. అయితే ఆ తరువాత నుంచి జెడి లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉంటున్నా ఎక్కడా చడీ చప్పుడూ లేదు.
ఎన్నికల అనంతరం ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేస్తూ వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలచుకోవడం వంటి అంశాల గురించి చెబుతూ వస్తున్నారు. కొన్ని చోట్లా కొద్దిమొత్తంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సేద్యం కూడా చేస్తున్నారు. మళ్లీ ఎన్నికల టైం వచ్చేస్తోంది. దీంతో మళ్లీ ఆయన విశాఖ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.
గతంలో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయబట్టి ఓడిపోయాం కానీ ఈసారి టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. అలాగైతే తనకు బలం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారని, అందుకే మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అలాగైతే ఈసారి శ్రీభరత్ కు టికెట్ లేనట్లే.. ఆయన్ను ఎక్కడ, ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.