‘RERA’ పూర్తయ్యేనా!.. స్థిరాస్తి కష్టాలు తీరేనా?
విధాత: రాష్ట్ర అవతరణ తర్వాత పాలనా సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ అనేక రంగాల్లో ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నదని సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి అంటున్నారు. స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) వచ్చి నాలుగున్నర ఏండ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయలేదు. అథారిటీకి ఓ చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం చేపట్టాల్సి ఉన్నా చేయటం లేదు. దీంతో […]

విధాత: రాష్ట్ర అవతరణ తర్వాత పాలనా సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ అనేక రంగాల్లో ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నదని సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి అంటున్నారు.
స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) వచ్చి నాలుగున్నర ఏండ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయలేదు. అథారిటీకి ఓ చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం చేపట్టాల్సి ఉన్నా చేయటం లేదు. దీంతో స్థిరాస్తి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సోమేశ్ కుమార్ రెరా రెగ్యులేటరీ అథారిటీ అధికారిగా కొనసాగుతున్నారు. ఇతినికే ప్రభుత్వంలో ఐదారు ప్రధాన శాఖల ఇన్‌చార్జీ బాధ్యతలుండటంతో ఏ పనీ సక్రమంగా చేయలేని దుస్థితి ఉన్నదని సుపరిపాలన వేదిక ఆరోపిస్తున్నది. వెంటనే పూర్తి స్థాయిలో రెరాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది.