Vangaveeti Radha | వంగవీటి రాధాకు టీడీపీ హామీ దక్కిందా?
విజయవాడ సెంట్రల్ టికెట్ వచ్చినట్టేనా? మరి బోండా పరిస్థితి ఏమిటి? Vangaveeti Radha | విధాత: ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వంగవీటి రాధాకృష్ణ పంతంబట్టారు. ఇటీవల జనసేనలో చేరుతారని పుకార్లు వచ్చాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ఆయనకు పవన్ హామీ కూడా ఉందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే నిన్న విజయవాడలో జరిగిన లోకేశ్ పాదయాత్రలో రాధా అంతా తానై వ్యవహరించారు. లోకేశ్ తో సన్నిహితంగా మెలిగారు. ఇక టీడీపీలో సెంట్రల్ టికెట్ […]

- విజయవాడ సెంట్రల్ టికెట్ వచ్చినట్టేనా?
- మరి బోండా పరిస్థితి ఏమిటి?
Vangaveeti Radha | విధాత: ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వంగవీటి రాధాకృష్ణ పంతంబట్టారు. ఇటీవల జనసేనలో చేరుతారని పుకార్లు వచ్చాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ఆయనకు పవన్ హామీ కూడా ఉందని వార్తలొచ్చాయి. తీరా చూస్తే నిన్న విజయవాడలో జరిగిన లోకేశ్ పాదయాత్రలో రాధా అంతా తానై వ్యవహరించారు. లోకేశ్ తో సన్నిహితంగా మెలిగారు. ఇక టీడీపీలో సెంట్రల్ టికెట్ దక్కినట్లేనా? అనే చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబు సైతం రాధాను వదులుకోవాలని అనుకోవడం లేదు.
రాధా కోరుకున్న సెంట్రల్ సీటులో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. ఆయన గత ఎన్నికలో జోగి రమేష్ చేతిలో చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. మరి ఆయన్ను కాదని రాధాకు సెంట్రల్ సీటు ఇస్తారా? అనే సందేహాలు ఉన్నాయి. ఆయనకు మచిలీపట్నం నుంచి లోక్ సభకు పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఒకవేళ ఆయన బందరు కానీ వద్దు అంటే గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ ఉన్న చోట నుంచి ఎంపీగా బరిలో దించుతారని సమాచారం.