విధాత: ఆ బాలుడి వయసు 14 ఏండ్లు.. ఓ పేరొందిన పాఠశాలలో చదువుతున్నాడు. తమ కుమారుడు బుద్ధిగా చదువుకుంటున్నాడని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం పుస్తకాలను పక్కన పెట్టేసి ప్రేమ పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. ఓ అమ్మాయిని ఉద్దేశించి నువ్వు నా భార్యవి అవుతావా..? అని పోస్ట్ పెట్టాడు. ఇది చాలామందిని ఆశ్చ్యర్య పరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర పుణెలోని హదప్సర్ ఏరియాకు చెందిన 14 ఏండ్ల బాలుడు.. స్థానికంగా ఉన్న ప్రముఖ స్కూల్ ల్లో చదువుతున్నాడు. అదే స్కూల్‌లో చదువుతున్న 13 ఏండ్ల అమ్మాయిపై ఆ బాలుడు మనుసు పారేసుకున్నాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. లేదంటే చంపేస్తా అని బెదిరించాడు. వేధింపులకు గురి చేసినప్పటికీ అతన్ని బాలిక పట్టించుకోలేదు.
కోపం పెంచుకున్న బాలుడు తన ఇన్ స్టాలో ఆ బాలిక ఫోటో పోస్ట్ చేసి.. నాకు భార్యవి అవుతావా..? అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన బాలిక తన పేరెంట్స్ కి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.