పట్టపగలే మహిళా న్యాయవాదిపై వేట కొడవలితో దాడి
విధాత : తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై వేట కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేశారు. న్యాయవాది జమీలా బాను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నారు. రీసెర్చ్‌లో భాగంగా జమీలా బాను తన కూతురితో కలిసి అడ్వకేట్స్ ఆఫీసును సందర్శించిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఆమె ఆఫీసులో ఉండగా.. బయటకు లాక్కొచ్చిన ఓ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే వేట కొడవలితో దాడి చేశాడు. ఈ దాడి నుంచి […]

విధాత : తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై వేట కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేశారు. న్యాయవాది జమీలా బాను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్నారు. రీసెర్చ్‌లో భాగంగా జమీలా బాను తన కూతురితో కలిసి అడ్వకేట్స్ ఆఫీసును సందర్శించిన సమయంలో ఈ దారుణం జరిగింది.
ఆమె ఆఫీసులో ఉండగా.. బయటకు లాక్కొచ్చిన ఓ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే వేట కొడవలితో దాడి చేశాడు. ఈ దాడి నుంచి తల్లిని కాపాడుకునేందుకు కూతురు ప్రయత్నించింది. కూతురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. జమీలాపై దాడి చేసిన అనంతరం ఆ దుండగుడు కొడవలిని వదిలి పారిపోయాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.