Woman catches husband red-handed। వేరే అమ్మాయితో భర్త డాన్స్.. భార్య వచ్చి.. ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయిస్తున్న వీడియో
Woman catches husband red-handed, VIRAL అసలే డిస్కోథెక్! అందులోనూ దుమ్ము రేపే మ్యూజిక్.. ఆపై సొగసరితో డ్యాన్స్.. ఇంకేముంది? మనవాడు రెచ్చిపోయాడు. అనారీ నెంబర్ 1 సినిమాలోని గోవిందా హిట్ సాంగ్ ‘మే లైలా లైలా చిల్లావూంగా కుర్తా ఫాడ్కే’ (Main Laila Laila Chillaunga Kurta Phadke) అంటూ కాళ్లూ చేతులు ఊపుకొంటూ ఆ అమ్మాయితో మైమరచిపోయి డాన్స్ చేస్తున్నాడు. అంతలోనే అతడి భార్య అది గమనించి అక్కడికి వచ్చి.. క్లాస్ పీకేసరికి.. మనోడు […]

Woman catches husband red-handed, VIRAL
అసలే డిస్కోథెక్! అందులోనూ దుమ్ము రేపే మ్యూజిక్.. ఆపై సొగసరితో డ్యాన్స్.. ఇంకేముంది? మనవాడు రెచ్చిపోయాడు. అనారీ నెంబర్ 1 సినిమాలోని గోవిందా హిట్ సాంగ్ ‘మే లైలా లైలా చిల్లావూంగా కుర్తా ఫాడ్కే’ (Main Laila Laila Chillaunga Kurta Phadke) అంటూ కాళ్లూ చేతులు ఊపుకొంటూ ఆ అమ్మాయితో మైమరచిపోయి డాన్స్ చేస్తున్నాడు. అంతలోనే అతడి భార్య అది గమనించి అక్కడికి వచ్చి.. క్లాస్ పీకేసరికి.. మనోడు కామ్ అయిపోయి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తున్నది.
హైఫై పార్టీల్లో వేరే అమ్మాయిలతో డాన్సులు చేస్తుండటం కామనే. కానీ.. అప్పడప్పడు అది ఇబ్బందికర పరిస్థితికి కూడా దారి తీస్తుంది అనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నది ఈ వీడియో. ఇందులో భర్త వేరే అమ్మాయితో జోరుగా స్టెప్పులేస్తుంటాడు.. నాకంటే ఆమె ఎక్కువా అనుకుందేమో.. సడన్‌గా మధ్యలో ఎంటర్ అయింది.
View this post on Instagram
ఇక చూడాలి దృశ్యం! ఇంకేముంటుంది.. సడన్‌గా సదరు భర్త కాళ్లకు బ్రేకులు పడ్డాయి. అప్పటికే అగ్గిమీద గుగ్గిలమైపోతున్న భార్య.. ఏం జరుగుతోందసలు.. నాకు తెలియాలి.. అంటూ కాలి చెప్పు తీసి.. కొడుతుందా? అనేంత సీన్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతున్నది.
అయితే.. ఇదంతా ముందుగానే స్క్రిప్ట్ తయారు చేసుకుని షూట్ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడగా.. మరికొందరు అసలు వారిద్దరూ భార్యాభర్తలనే గ్యారెంటీ ఏంటని క్వశ్చన్లు పెట్టారు. ఏది ఏమైనా.. డిస్కోథెక్కుల్లో కూడా మహిళా పవర్ పనిచేస్తుందన్న మాట!
Woman catches husband red-handed। వేరే అమ్మాయితో భర్త డాన్స్.. భార్య వచ్చి.. ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయిస్తున్న వీడియో | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/yEJr5kCnp0 #VIRAL #DANCE #Baahubali2 #AA23 pic.twitter.com/ybs102McPc
— vidhaathanews (@vidhaathanews) March 3, 2023