Viral | జిమ్ చేస్తూ గుండెపోటుతో యువ‌తి మృతి

Viral Video | వ్యాయామం శ‌రీరానికి మంచిదే. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేయ‌డం కూడా మంచిదే. కానీ మితిమీరి వ‌ర్క‌వుట్స్ చేయ‌డం శ‌రీరానికి ప్ర‌మాదం. రోజుకు అర‌గంట పాటు జిమ్ చేయ‌డం వ‌ల్ల పెద్ద న‌ష్ట‌మేమి ఉండ‌దు. గంట‌ల పాటు వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల్ల గుండెపోటుకు గుర‌వుతున్నారు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ యువ‌తి కూడా జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై క్ష‌ణాల్లోనే కుప్ప‌కూలిపోయింది. జిమ్ సెంట‌ర్లో […]

Viral | జిమ్ చేస్తూ గుండెపోటుతో యువ‌తి మృతి

Viral Video | వ్యాయామం శ‌రీరానికి మంచిదే. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేయ‌డం కూడా మంచిదే. కానీ మితిమీరి వ‌ర్క‌వుట్స్ చేయ‌డం శ‌రీరానికి ప్ర‌మాదం. రోజుకు అర‌గంట పాటు జిమ్ చేయ‌డం వ‌ల్ల పెద్ద న‌ష్ట‌మేమి ఉండ‌దు. గంట‌ల పాటు వ‌ర్క‌వుట్స్ చేయ‌డం వ‌ల్ల గుండెపోటుకు గుర‌వుతున్నారు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఓ యువ‌తి కూడా జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై క్ష‌ణాల్లోనే కుప్ప‌కూలిపోయింది. జిమ్ సెంట‌ర్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే ఆ జిమ్ సెంట‌ర్ ఎక్క‌డుందో మాత్రం తెలియ‌రాలేదు.

ఇటీవ‌ల వెల్ల‌డైన అధ్య‌య‌నాల ప్ర‌కారం దేశంలో జిమ్ చేసే వారిలో కోటి మందికి పైగా గుండెపోటు ముప్పున‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మితిమీరిన జిమ్ చేయడం, కొవ్వు పెరిగే ఆహారం తినడం, వంశ పారంపర్య లక్షణాలు, మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం గుండెపోటుకు దారి తీస్తున్నాయని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

గుండెపోటుకు గుర‌వుతున్న వారిలో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు పూర్తిగా మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది.