మైనర్ అబ్బాయిని తీసుకెళ్లి పెళ్లాడింది.. గర్భం ధరించింది.. ఇంతలో!
విధాత: ఓ యువతి తన క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. కానీ అతను మైనర్. అయినప్పటికీ అతన్ని ఇష్టపడి ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ యువతి గర్భిణి కూడా. అయితే తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుందని ఆ యువతిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ 20 ఏండ్ల యువతి డిగ్రీ చదువుతోంది. అయితే తన క్లాస్‌మేట్‌తో ఆమె ప్రేమలో పడింది. వయసులో […]

విధాత: ఓ యువతి తన క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. కానీ అతను మైనర్. అయినప్పటికీ అతన్ని ఇష్టపడి ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ యువతి గర్భిణి కూడా. అయితే తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుందని ఆ యువతిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ 20 ఏండ్ల యువతి డిగ్రీ చదువుతోంది. అయితే తన క్లాస్‌మేట్‌తో ఆమె ప్రేమలో పడింది. వయసులో ఆమె కంటే అతను చిన్నోడు. కానీ వారి ప్రేమకు వయసు అడ్డు రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కుర్రాడిని తీసుకెళ్లి మరి పెళ్లి చేసుకుని.. ఇరు కుటుంబాలకు తెలియకుండా వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు. ప్రస్తుతం ఆ యువతి గర్భిణి.
అయితే తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి.. ఆ యువతి పెళ్లి చేసుకుందని, అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మొత్తానికి ఆ కుర్రాడి ఆచూకీని పోలీసులు కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. గర్భిణిని అరెస్టు చేశారు. ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక నిన్న తమిళనాడులోని కడలూరులో ఓ ఇద్దరు విద్యార్థినులు బస్టాండ్‌లోనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అబ్బాయి అమ్మాయికి బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు. అబ్బాయి వయసు 17 ఏండ్లు కాగా, అమ్మాయి వయసు 16 ఏండ్లు. ఈ ఘటనపై కూడా తమిళనాడు పోలీసులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆ విద్యార్థినితో.. అతనికి లైంగిక సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.