దొంగ‌త‌నం మోపారని.. 58 ఏండ్ల మ‌హిళ‌పై 16 ఏండ్ల బాలుడు అత్యాచారం

Madhya Pradesh | ఓ బాలుడు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న‌పై దొంగ‌త‌నం మోపార‌నే అవ‌మానంతో 58 ఏండ్ల మ‌హిళ‌పై 16 ఏండ్ల బాలుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా కొడ‌వ‌లితో దాడి చేసి ఆమెను చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రీవా జిల్లాలో జ‌న‌వ‌రి 30వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 58 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి రీవా జిల్లాలో ఉంటుంది. అయితే మ‌హిళ […]

దొంగ‌త‌నం మోపారని.. 58 ఏండ్ల మ‌హిళ‌పై 16 ఏండ్ల బాలుడు అత్యాచారం

Madhya Pradesh | ఓ బాలుడు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న‌పై దొంగ‌త‌నం మోపార‌నే అవ‌మానంతో 58 ఏండ్ల మ‌హిళ‌పై 16 ఏండ్ల బాలుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా కొడ‌వ‌లితో దాడి చేసి ఆమెను చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రీవా జిల్లాలో జ‌న‌వ‌రి 30వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ 58 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి రీవా జిల్లాలో ఉంటుంది. అయితే మ‌హిళ ఇంట్లో టీవీ ఉండ‌టంతో.. పొరుగింట్లో ఉన్న ఓ బాలుడు టీవీ చూసేందుకు ప్ర‌తి రోజు వెళ్లేవాడు. కొద్ది రోజుల క్రితం ఆ ఇంట్లో ఫోన్ అదృశ్య‌మైంది. ఆ ఫోన్‌ను ఈ బాలుడే దొంగిలించి ఉండొచ్చ‌ని అత‌న్ని నిందించారు. దీంతో ఆ అబ్బాయి తీవ్ర అవ‌మానానికి గుర‌య్యాడు.

జ‌న‌వ‌రి 30వ తేదీన మ‌హిళ ఒక్క‌తే ఇంట్లో ఉన్న‌ట్లు గుర్తించాడు బాలుడు. ఆ ఇంటికి చేరుకున్న అబ్బాయి.. ఆమెను తాళ్ల‌తో క‌ట్టేసి అత్యాచారం చేశాడు. ప్ర‌యివేటు భాగాల్లో క‌ర్ర‌తో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. వేట కొడ‌వ‌లితో త‌ల‌, ఇత‌ర భాగాల్లో విచక్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి, ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు.