అపాన వాయువును అమ్ముకుంటున్న మ‌హిళ‌..! డ‌బ్బా ఖ‌రీదు 25 వేలు..!!

ఈ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చెమ‌టోడ్చి డ‌బ్బులు సంపాదించే వారు ఉన్నారు. ఎలాంటి చెమ‌టోడ్చ‌కుండా సుల‌భంగా డ‌బ్బులు సంపాదించే వారు ఉన్నారు

అపాన వాయువును అమ్ముకుంటున్న మ‌హిళ‌..! డ‌బ్బా ఖ‌రీదు 25 వేలు..!!

ఈ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చెమ‌టోడ్చి డ‌బ్బులు సంపాదించే వారు ఉన్నారు. ఎలాంటి చెమ‌టోడ్చ‌కుండా సుల‌భంగా డ‌బ్బులు సంపాదించే వారు ఉన్నారు. ఓ మ‌హిళ కూడా ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కుండా డ‌బ్బులు సంపాదించే మార్గాన్ని వెతుక్కున్నారు. అపాన వాయువు(పిత్తు)ను అమ్ముకుంటూ ఈజీగా డ‌బ్బు సంపాదిస్తున్నారు. మ‌రి ఆమె అపాన వాయువును ఒక‌ట్రెండు రూపాయాల‌కు విక్ర‌యించ‌డం లేదు.. వేల రూపాయాల‌కు విక్ర‌యిస్తోంది. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే.. మ‌రి ఆమె గురించి తెలుసుకోవాలంటే.. సింగ‌పూర్‌ వెళ్ల‌క త‌ప్ప‌దు.

వివ‌రాల్లోకి వెళ్తే.. సింగ‌పూర్‌కు చెందిన‌ చెంగ్ వింగ్ యీ(కియారాకిట్టి) సోష‌ల్ మీడియా స్టార్‌. ఆవిడకు ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది. అయితే ఈజీగా డ‌బ్బులు సంపాదించే మార్గాన్ని వెతుక్కున్నారు ఆమె. జార్ల‌లో త‌న అపాన వాయువును నింపి.. త‌న అభిమానుల‌కు విక్ర‌యించే బిజినెస్ స్టార్ట్ చేశారు. అపాన వాయువుతో కూడిన ఒక్కో జార్‌ను రూ. 24,820కి అమ్ముతున్నారు. ఈ బిజినెస్ ప్రారంభించిన ఆమె బాగానే సంపాదించారు.

అయితే ఈ అపాన వాయువును కొనుగోలు చేసిన త‌ర్వాత 30 రోజుల వ‌ర‌కు ఎప్పుడు ఓపెన్ చేసినా.. వాస‌న వ‌స్తుంద‌ని చెంగ్ వింగ్ తెలిపారు. కొన్నిసార్లు అయితే ఆమె త‌న అపాన వాయువు క్ష‌ణాల్లో అమ్ముడుపోయింద‌ని, సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక త‌న అపాన వాయువు గురించి ఆమె ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చింది. మీ ఫేవ‌రేట్ స్ట్రీమ‌ర్ కియార‌కిట్టి స్మెల్ ఏ విధంగా ఉందో చూడాల‌నుకుంటున్నారా..? అయితే ఈ జార్ కొనుగోలు చేసి.. ఆస్వాదించండి అంటూ ప్ర‌క‌ట‌న‌లో ఆమె పేర్కొన్నారు. ఈ వాయువు ఒక్క‌టే కాదు.. ఆమె ధ‌రించిన లో దుస్తులు, స్నానం చేసిన బాత్ వాట‌ర్‌ను కూడా విక్ర‌యించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు చెంగ్ వింగ్ తెలిపారు.