Cat | అంత‌రిక్షంలోకి.. వెళ్లిన ఏకైక పిల్లి గురించి తెలుసా?

Cat విధాత‌: ఇస్రో స‌హా వివిధ అంత‌రిక్ష సంస్థ‌లు సాధిస్తున్న విజ‌యాల‌ను చూసి జ‌బ్బ‌లు చ‌రుచుకుంటు న్నాం. కానీ ఈ స్థితికి చేరుకోవ‌డానికి మ‌న‌కు తొలి ద‌శ‌లో ఎంత‌గానో సాయ‌ ప‌డి త‌మ ప్రాణాల‌ను త్యాగం చేసిన మూగ‌ జీవాల‌ను మ‌ర్చి పోకూడ‌ద‌ని సైన్స్ అభిమానులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు. ఏదైనా మందును మార్కెట్‌లోకి తీసుకు రావ‌డానికి ముందు సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా దానిని వివిధ ద‌శ‌ల్లో ప‌రీక్షించాల్సి ఉంటుంది. ముందుగా జంతువుల‌పై ప‌రిశోధ‌న చేసి అక్క‌డి లోపాలు స‌రిచేసి […]

Cat | అంత‌రిక్షంలోకి.. వెళ్లిన ఏకైక పిల్లి గురించి తెలుసా?

Cat

విధాత‌: ఇస్రో స‌హా వివిధ అంత‌రిక్ష సంస్థ‌లు సాధిస్తున్న విజ‌యాల‌ను చూసి జ‌బ్బ‌లు చ‌రుచుకుంటు న్నాం. కానీ ఈ స్థితికి చేరుకోవ‌డానికి మ‌న‌కు తొలి ద‌శ‌లో ఎంత‌గానో సాయ‌ ప‌డి త‌మ ప్రాణాల‌ను త్యాగం చేసిన మూగ‌ జీవాల‌ను మ‌ర్చి పోకూడ‌ద‌ని సైన్స్ అభిమానులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు.

ఏదైనా మందును మార్కెట్‌లోకి తీసుకు రావ‌డానికి ముందు సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా దానిని వివిధ ద‌శ‌ల్లో ప‌రీక్షించాల్సి ఉంటుంది. ముందుగా జంతువుల‌పై ప‌రిశోధ‌న చేసి అక్క‌డి లోపాలు స‌రిచేసి అప్పుడు మ‌నుషులకు వాటిని ఉప‌యోగిస్తారు. ఈ క్ర‌మంలో ఏటా కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఈ త‌ర‌హాలోనే మ‌నుషుల్ని అంత‌రిక్షంలోకి పంపాల‌న ఆలోచ‌న వ‌చ్చిన‌ తొలి నాళ్ల‌లో.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి తొలుత జంతువుల్ని పంపాల‌ని శాస్త్రవేత్త‌లు నిర్ణ‌యించుకున్నారు. 80 ఏళ్ల క్రితం అలా వెళ్లిన వాటిలో మొద‌టి, ఏకైక పిల్లి ఫెలిసెటే. తెల్ల‌ని, న‌ల్ల‌ని మచ్చ‌ల‌తో ముద్దొచ్చే ఈ పిల్లి ప్యారిస్ వీధుల్లో తిరుగుతూ ఉండేది.

ఫ్రాన్స్ అంత‌రిక్ష సంస్థ త‌న ప‌రిశోధ‌న కోసం సేక‌రించిన పిల్లుల్లో ఫెలిసెటే కూడా ఒక‌టి. వీటికి బాగా శిక్ష‌ణనిచ్చి ప్ర‌తిభ చూపిన పిల్లిని అంత‌రిక్షంలోకి పంప‌డ‌మే శాస్త్రవేత్త‌ల ఉద్దేశం. వాటితో త‌మ‌కు ఏ ర‌క‌మైన అనుబంధం ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌యోగ స‌మ‌యంలో వాటికి పేర్లు పెట్ట‌కుండా కేవ‌లం నంబర్ల‌తోనే ఈ పిల్లుల గురించి ప్ర‌స్తావించే వారు.

వ్యోమ‌గామ శిక్ష‌ణ‌లో భాగంగా వాటికి గురుత్వాక‌ర్షణ ర‌హిత స్థితికి అలవాటు చేయ‌డం, చిన్న చిన్న కంటైన‌ర్ బాక్సుల్లో నిల‌క‌డ‌గా కూర్చోవ‌డం వంటివి నేర్పించే వారు. ఈ ప‌రిస్థితుల్లో వాటి మెద‌డు స్పంద‌న‌ల‌ను, ఇత‌ర ఆరోగ్య ప‌రమితుల‌ను తెలుసుకునే వారు.

అనేక ద‌శ‌ల్లో శిక్ష‌ణ‌కు త‌ట్టుకుని చివ‌ర‌కు ఆరు పిల్లులు మిగ‌ల‌గా.. వాటిలో అత్యున్న‌త ప్రతిభ క‌న‌బ‌రిచిన సీ341 ( ఫెలిసెటే)ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని నిర్ణయించారు. అలా అక్టోబ‌రు 18, 1938న వెరోనికే అనే రాకెట్‌లో భూమికి 157 కి.మీ. ఎత్తులోకి ఫెలిసెటేను పంపారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌గా దాని హృద‌య స్పంద‌న‌, మెద‌డు స్పంద‌న‌ల‌ను శాస్త్రవేత్త‌లు న‌మోదు చేసుకున్నారు.

అనంత‌రం అది స‌జీవంగా భూమి పైకి తిరిగొచ్చేసింది. అయితే కొన్ని నెల‌ల త‌ర్వాత లోతైన ప‌రిశోధ‌న‌లు చేసే నిమిత్తం శాస్త్రవేత్త‌లే దాని ఊపిరిని తీసి ప్ర‌యోగాలు నిర్వ‌హించారు. ఇలా మాన‌వుని అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ఆ పిల్లి ఒక స‌మిధ‌గా మారింది. ఇలాంటివి చదివినప్పుడు, విన్నపుడే మనకూ తెలుస్తుంది ప్రతిభ కనబరచడం, ఫస్ట్ రావడం కూడా ఒక్కోసారి ప్రమాదమని.

స్మార‌కం నిర్మాణానికి నిధుల సేక‌ర‌ణ‌

ఫెలిసెటే త్యాగాన్ని తెలుసుకున్న సుమారు 1100 మంది 2017లోనే దానికి ఒక స్మార‌కాన్ని నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. సుమారు 57 వేల డాల‌ర్ల‌ను వారు సేక‌రించి అనుకున్న‌ట్లు గానే దాని శిల్పాన్ని త‌యారు చేయించారు. ఐదు అడుగుల ఎత్తున్న ఫెలిసెటే భూ గోళంపై కూర్చున్న‌ట్లు ఉండే ఈ శిల్పం.. ఫ్రాన్స్‌లో ఉన్న ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ యూనివ‌ర్సిటీలో సంద‌ర్శ‌కుల‌ను అల‌రిస్తోంది.