నా హక్కును గౌరవిస్తేనే రాజీ: రచయిత శరత్ చంద్ర

శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా కథపై నా వాస్తవ హక్కును గౌరవించేందుకు అంగీకరించి క్షమాపణ చెబితేనే రాజీకి ఒప్పుకుంటానని రచయిత శరత్ చంద్ర తెలిపారు

నా హక్కును గౌరవిస్తేనే రాజీ: రచయిత శరత్ చంద్ర

విధాత : శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా కథపై నా వాస్తవ హక్కును గౌరవించేందుకు అంగీకరించి తప్పు చేశానని అని క్షమాపణ చెబితేనే రాజీకి ఒప్పుకుంటానని రచయిత శరత్ చంద్ర తెలిపారు. శ్రీమంతుడు టీమ్ నాకు 15 లక్షలు కాంప్రమయిజ్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ నాకు కావాల్సింది ఆ కథపై నా హక్కు అని ఆయన స్పష్టం చేశారు. నా హక్కును అంగీకరించి కొరటాల తప్పు చేశాను అని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే జైలుకి పంపిస్తానని తేల్చి చెప్పారు