PM Modi l సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. మోడీకి లేఖ రాసిన ప్రతిపక్ష నేతలు
లేఖ రాసిన సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు.. written to Modi condemning Sisodia's arrest విధాత: ఆప్ నేత మనీశ్ సిసోడియా అరెస్టు(Sisodia arrest)ను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్రమోడి(PM Modi)కి తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపు పయనిస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనమని నేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమన్నారు. […]

- లేఖ రాసిన సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు..
written to Modi condemning Sisodia’s arrest
విధాత: ఆప్ నేత మనీశ్ సిసోడియా అరెస్టు(Sisodia arrest)ను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్రమోడి(PM Modi)కి తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపు పయనిస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనమని నేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని పేర్కొన్నారు.
ప్రధానికి లేఖ రాసిన వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్, బెంగాల్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఉన్నారు.