యాదాద్రి ఆలయం మూసివేత
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 8:50 నుంచి 26న ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. 25న భక్తులచే జరిపే నిత్యకళ్యాణం, శాశ్వత కళ్యాణం,శాశ్వత బ్రహ్మోత్సవం, 26న స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. 26న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10.30 నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకోవచ్చని […]

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 8:50 నుంచి 26న ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు.
25న భక్తులచే జరిపే నిత్యకళ్యాణం, శాశ్వత కళ్యాణం,శాశ్వత బ్రహ్మోత్సవం, 26న స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. 26న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10.30 నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.