Yamuna Floods
విధాత: దేశ రాజధాని దిల్లీ (Delhi) ని వరదలు ముంచెత్తి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో యమునా నది ఉప్పొంగి (Yamuna Floods) ప్రమాద స్థితిని దాటిని ప్రవహిస్తుండటం కలవరపరుస్తోంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం సాయంత్రానికి 205.33 మీటర్ల ఎత్తుతో ప్రవాహం ఉండగా.. మంగళవారం ఉదయం హరియాణాలోని హీరాకుడ్ డ్యాం నుంచి నీటిని వదలడంతో ఈ రోజు ప్రవాహం ఎత్తు 206.38 మీటర్లుగా ఉంది.
దీంతో ప్రమాదం పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్యాం నుంచి వచ్చే పూర్తి ప్రవాహం దిల్లీని చేరుకోవడానికి మరో 24 గంటలు పడుతుందని.. అప్పటి లోపు అందరినీ శిబిరాలకు తరలించాల్సిందేనని అధికారులు తెలిపారు. 1978లో నమోదైన 207.49 మీటర్ల ఎత్తు ప్రవాహాన్ని ఈ ఏడాది అధిగమించే ప్రమాదముందన్నారు.
Delhi | At 8 am today, water level of River Yamuna recorded at 206.32 metres at Old Railway Bridge, flowing above the danger level. The highest flood level of the river in Delhi is 207.49 metres.
As a precautionary measure, Railway and traffic movement on Old Railway Bridge has… pic.twitter.com/V9qjGHKLLj
— ANI (@ANI) July 11, 2023
మరోవైపు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు పార్కులు, నివాసలు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, ఆసుపత్రులు నీటమునిగాయి. మోకాళ్ల లోతులో నడుస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి దిల్లీ ప్రభుత్వం 16 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. 40 ఏళ్ల కాలంలో ఇలాంటి వర్షాలను చూడలేదని, ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ ఈ వరదను తట్టుకోలేదని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.