Yatra-2 | YSR యాత్రకు సీక్వెల్.. YS జగన్‌ యాత్ర-2 ! ఎన్నికల ముందు విడుదల

Yatra-2 జగన్ కోసం మరో సినిమా సిద్ధం జగన్ పాత్రలో తమిళ హీరో జీవా విధాత‌: ఇప్పటికే సీఎం జగన్ జీవిత చరిత్రను వ్యూహం పేరిట రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఇంకో చిత్రం రెడీ అవుతోంది. అవును ఆంధ్రాలో సినిమా అభిమానం అభిమానులు ఎక్కువ.. సమాజం మీద దాని ప్రభావమూ ఎక్కువే. అందుకే తమ అభిప్రాయాలూ.. తమ వీర గాధలు.. తమ విజయాలు సినిమాలుగా రావాలని కోరుకునే నాయకులూ ఆంధ్రాలో ఎక్కువ. ఈ నేపథ్యములో […]

Yatra-2 | YSR యాత్రకు సీక్వెల్.. YS జగన్‌ యాత్ర-2 ! ఎన్నికల ముందు విడుదల

Yatra-2

  • జగన్ కోసం మరో సినిమా సిద్ధం
  • జగన్ పాత్రలో తమిళ హీరో జీవా

విధాత‌: ఇప్పటికే సీఎం జగన్ జీవిత చరిత్రను వ్యూహం పేరిట రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఇంకో చిత్రం రెడీ అవుతోంది. అవును ఆంధ్రాలో సినిమా అభిమానం అభిమానులు ఎక్కువ.. సమాజం మీద దాని ప్రభావమూ ఎక్కువే. అందుకే తమ అభిప్రాయాలూ.. తమ వీర గాధలు.. తమ విజయాలు సినిమాలుగా రావాలని కోరుకునే నాయకులూ ఆంధ్రాలో ఎక్కువ.

ఈ నేపథ్యములో గత ఎన్నికల ముందు యాత్ర అని సినిమా వచ్చి మంచి సక్సెస్ సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్రను కథాంశంగా తీసుకుని, ఆ యాత్ర ప్రజల్లో ఎంతటి పాజిటివ్ ఇమేజి తెచ్చింది, తద్వారా కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది వివరిస్తూ తీసిన ఆ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారు.

2019 ఎన్నికల ముందు వచ్చిన ఆ చిత్రం జగన్ కు బాగా హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు అదే సంస్థవారు. అదే డైరెక్టర్ మహి వి.రాఘవ దర్శకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను యాత్ర-2 పేరిట ఇంకో సినిమాగా అంటే యాత్రకు సీక్వెల్ గా రెడీ చేస్తున్నారు.

అయితే ఇటీవల మహి వీ రాఘవ దర్శకత్వంలోనే వచ్చిన సేవ్‌ దీ టైగర్స్‌, సైథాన్‌ వెబ్‌ సీరీస్‌లు ఓటీటీలో ఓ దుమ్ము దులుపుతున్నాయి. వాటి సీక్వెల్స్‌ కోసం జనం ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు యాత్రకు సీక్వెల్‌ విడుదల తేదీ ప్రకటించి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు దర్శకుడు రాఘవ.

ఇందులో తమిళ హీరో సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మాత తనయుడు (రంగం ఫేమ్‌) జీవా హీరోగా వైఎస్‌ జగన్ పాత్రలో నటిస్తున్నాడు. అవేవిధఃగా దసరా సినిమాతో మంచి మ్యూజికల్‌ హిట్‌ సాధించిన సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించనున్నాడు. ఎన్నికల ముందు ఫిభ్రవరి 2024లో సినిమాను విడుదల చేయనున్నారు

జగన్ మోహన్ రెడ్డి ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, మార్గమధ్యలో ప్రజలు, వివిధ వర్గాల ప్రజలను కలిసినది, వారి సమస్యలు అర్థం చేసుకునే తీరు. మొత్తం పాదయాత్ర జగన్ను ఓ గొప్ప నాయకుడిగా ఎలా నిలబెట్టింది ఇదంతా యాత్ర-2 లో చూపడానికి ప్లాన్ సిద్ధం చేశారు. వాస్తవానికి 2019లో జగన్ చేసిన పాదయాత్ర ఆయన్ను ఆంధ్రాలో తిరుగులేని నాయకుడిగా మార్చింది.

తెలుగుదేశంలో హేమాహేమీలు సైతం మట్టికరిచిన ఎన్నికలు అవి. నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని ఇదివరకు ఎన్నడూ ఎరుగని స్థాయి ఓటమిని పరిచయం చేసిన ఎన్నికలకు జగన్ పాదయాత్ర ఎంతగానో దోహద పడింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లు గెలిచిన జగన్ టిడిపిని కేవలం 23 స్థానాలకు పరిమితం చేయగలిగారు. లోక్‌సభ సీట్లలో ముచ్చటగా మూడు సీట్లతో ఊరుకోవాల్సిన పరిస్థితి.

అందుకే ఆ పాదయాత్రను మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో యాత్ర-2 పేరిట సినిమా సిద్ధం అవుతోంది. దీంతో జగన్ కోసం అటు ఆర్జీవీ వ్యూహం, ఇటు యాత్ర-2 రెండు సినిమాలు ఎన్నికలకు ముందు విడుదల అవుతాయి అన్నమాట. దీనికి ప్రతిగా టిడిపి ఏమి ప్లాన్ చేస్తుందో చూడాలి.