దారికొచ్చిన రామ్ దేవ్ బాబా.. మహిళలకు క్షమాపణలు!

విధాత‌: నోరా వీపుకు చేటు తేవద్దమ్మా అని పెద్దలు చెప్పింది మరోమారు నిజమైంది. నోటితో సభ్యత, మర్యాద.. మన్నన కలిగిన మాటలు వస్తే పదిమందిలో గౌరవం ఉంటుంది. అలాకాకుండా నోరుంది కదాని ఇష్టానుసారం వాగితే వీపులు. వాచిపోతాయ్ కదా.. ఈ విషయం మరోమారు రుజువైంది. మహిళలు చీరకట్టుకున్నా అందంగా ఉంటారు.. అసలేమి కట్టుకోకున్నా బాగానే ఉంటారని పదిమందిలో మాట్లాడిన యోగ గురువు రాందేవ్ కు తన తప్పు తెలిసొచ్చినట్లుంది. రెండ్రోజుల్లో సోషల్ మీడియా జనాలు చీవాట్లు పెట్టడంతో […]

  • Publish Date - November 28, 2022 / 01:55 PM IST

విధాత‌: నోరా వీపుకు చేటు తేవద్దమ్మా అని పెద్దలు చెప్పింది మరోమారు నిజమైంది. నోటితో సభ్యత, మర్యాద.. మన్నన కలిగిన మాటలు వస్తే పదిమందిలో గౌరవం ఉంటుంది. అలాకాకుండా నోరుంది కదాని ఇష్టానుసారం వాగితే వీపులు. వాచిపోతాయ్ కదా.. ఈ విషయం మరోమారు రుజువైంది. మహిళలు చీరకట్టుకున్నా అందంగా ఉంటారు.. అసలేమి కట్టుకోకున్నా బాగానే ఉంటారని పదిమందిలో మాట్లాడిన యోగ గురువు రాందేవ్ కు తన తప్పు తెలిసొచ్చినట్లుంది. రెండ్రోజుల్లో సోషల్ మీడియా జనాలు చీవాట్లు పెట్టడంతో క్షమాపణ చెప్పారు.

మొన్నామధ్యా థానేలో జరిగిన సభలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ పాల్గొనగా ఇందులో రామ్ దేవ్ బాబా మాట్లాడారు. వేలాదిమంది మహిళలు పాల్గొన్నకార్యక్రమంలో రాందేవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు తనలాగా దుస్తులు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు..” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాసంఘాలు.. మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మహిళలకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాందేవ్ బాబా వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. దేశ మహిళలకు రాందేవ్ బాబా వెంటనే క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్ మాధ్యమంగా ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఆయన దారికొచ్చి క్షమాపణ చెప్పారు. ఈమేరకు ఓ లేఖను విడుదల చేయగా దాన్ని మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

“మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “బేటీ బచావో – బేటీ పడావో” వంటి కార్యక్రమాలు నేను ప్రోత్సహిస్తాను.. మహిళలను అగౌరవ పర్చాలన్న ఉద్దేశం లేదని” ఆ లేఖలో రామ్ దేవ్ బాబా పేర్కొన్నారు. ఇక ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ వాస్తవం కాదన్నారు. అయినప్పటికీ తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడితే.. వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నానని రాందేవ్ బాబా పేర్కొన్నారు. మొత్తానికి మహిళా శక్తి ముందు బాబా తలవంచక తప్పలేదు.