YS JAGAN | రేపు విశాఖకు జగన్.. ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన
YS JAGAN | ఎయులో యువతతో ముఖాముఖి ఇన్నాళ్లూ బిజీగా ఉన్నారో… ఇప్పుడు యువతతో అవసరం పడిందో కానీ జగన్ ఇప్పుడు రూట్ మార్చారు. యివతతో మమేకం అయ్యే ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. విశాఖలో రేపు 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్ కోసం శంకుస్థాపన చేసేందుకు విశాఖ వస్తున్న జగన్ అదే తరుణంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న కుర్రాళ్లతో ముఖాముఖీ నిర్వహిస్తారు. వారి ఆలోచనలు.. వారి డిమాండ్స్… కొత్త భవనాలు వంటివి […]

YS JAGAN |
ఎయులో యువతతో ముఖాముఖి
ఇన్నాళ్లూ బిజీగా ఉన్నారో… ఇప్పుడు యువతతో అవసరం పడిందో కానీ జగన్ ఇప్పుడు రూట్ మార్చారు. యివతతో మమేకం అయ్యే ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. విశాఖలో రేపు 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్ కోసం శంకుస్థాపన చేసేందుకు విశాఖ వస్తున్న జగన్ అదే తరుణంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న కుర్రాళ్లతో ముఖాముఖీ నిర్వహిస్తారు.
వారి ఆలోచనలు.. వారి డిమాండ్స్… కొత్త భవనాలు వంటివి వారు సీఎంతో పంచుకుంటారు.. వారి సందేహాలకు అయన సమాధానాలు ఇస్తారు. ఇక ఇనార్బిట్ మాల్ కూడా దాదాపు 2000 మందికి ఉపాధి కల్పిస్తుంది అంటున్నారు.
దాదాపు 17 ఎకరాల్లో నిర్మాణం అవుతున్న ఈ మాల్ లో పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులు , షూరూములు.. సినిమా.. ఫుడ్ కోర్ట్ ఇలా సర్వం లభించేలా ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మాల్ విశాఖకు మరో పెద్ద ఎస్సెట్ అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. రహేజా గ్రూప్ ఈ మాల్ కోసం దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తోంది.