YS Sharmila | డ్యూటీలో ఉన్న పోలీసులపై.. చేయి చేసుకున్న షర్మిల

YS Sharmila లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత విధాత‌: హైదరాబాద్‌లోని షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వైఎస్ షర్మిల (YS Sharmila) ను పోలీసులు గృహ నిర్బంధం చేసి, ఇంటి బైటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైఎస్ షర్మిల (YS Sharmila) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీస్‌ అధికారులపై ఆమె చేయి చేసుకున్నారు. టీ-సేవ్‌ నిరాహారదీక్షలో భాగంగా షర్మిల ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ఇంటి నుంచి బయలుదేరాలని […]

  • Publish Date - April 24, 2023 / 06:01 AM IST

YS Sharmila

  • లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత

విధాత‌: హైదరాబాద్‌లోని షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వైఎస్ షర్మిల (YS Sharmila) ను పోలీసులు గృహ నిర్బంధం చేసి, ఇంటి బైటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైఎస్ షర్మిల (YS Sharmila) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీస్‌ అధికారులపై ఆమె చేయి చేసుకున్నారు.

టీ-సేవ్‌ నిరాహారదీక్షలో భాగంగా షర్మిల ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ఇంటి నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ 26న నిరుద్యోగుల పక్షాన విపక్షాల ఆధ్వర్యంలో టీ-సేవ్‌ నిరాహారదీక్ష జరగనున్నది. దీనికి మద్దతు తెలుపాలని బయలుదేరారు.

ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గతంలో సంఘటలన దృష్ట్యా పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసు అధికారులపై ఆమె చేయి చేసుకున్న దృశ్యాలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే.. టీ-సేవ్‌ నిరాహారదీక్ష కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నామని, మమ్మల్ని ఎందుకు అనవసరంగా , అకారణంగా గృహనిర్బంధం చేస్తున్నారని షర్మల పార్టీ తరఫున నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. తమ రోజు వారీ కార్యక్రమాలను నిర్వహించుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా? నన్ను ఎందుకు గృహనిర్బంధం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని అన్నారు.