Life style news | మగవాళ్లు ఎక్కువకాలం ఒంటరి జీవితం గడపవద్దట.. ఎందుకో తెలుసా..?
Life style news : సాధారణంగా అపరిశుభ్ర పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం లాంటి కారణాలవల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జన్యసంబంధ కారణాలవల్ల కూడా మరికొన్ని అనారోగ్యాలు దరిచేరుతాయి.

Life style news : సాధారణంగా అపరిశుభ్ర పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం లాంటి కారణాలవల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జన్యసంబంధ కారణాలవల్ల కూడా మరికొన్ని అనారోగ్యాలు దరిచేరుతాయి. అయితే ఇవేగాక ఒంటరితనంతో కూడా మానసిక, శారీరక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఏండ్ల తరబడి ఒంటరిగా జీవించడం, వరుసగా సంబంధాలు తెగిపోవడం జరిగినప్పుడు అలాంటివారి రక్త కణాల్లో తేడాలు వస్తాయని, ఇది క్రమంగా రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడించింది.
అయితే ఈ పరిస్థితి కేవలం ఒంటరి మగవాళ్లలో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ఈ నూతన అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఒంటరితనంవల్ల కనిపించే ఈ ఇన్‌ఫ్లమేషన్‌ను లోగ్రేడ్ ఇన్‌ఫ్లమేషన్‌గా వర్గీకరించారు. ఇది నిరంతరం కొనసాగుతుందని, వయసు సంబంధ అనారోగ్యాలకు, మరణాలకు ఈ ఇన్‌ఫ్లమేషన్ దారితీస్తుందని తెలిపారు.
జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం లేదంటే ఆమెతో తరచూ సంబంధాలను తెంచుకుంటూ ఎక్కువకాలం ఒంటరిగా జీవించడంవల్ల బలహీనమైన శారీరక, మానసిక స్థితిలోకి వెళ్లడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, మరణాలు సంభవించడం లాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మొత్తం 4,835 మందిపై పరిశోధన చేసి నివేదికను తయారుచేశారు. అంతా 48 ఏండ్ల నుంచి 62 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిని పరిశోధన కోసం ఎంచుకున్నారు.