Honeymoon Spots | నవ దంపతుల శృంగార విహారయాత్రలకు.. టాప్ మాన్సూన్ స్పాట్స్ ఇవే..
Honeymoon Spots | మీకు కొత్తగా పెళ్లైందా..? వర్షాకాలం( Monsoon )లో హనీమూన్( Honeymoon ) ప్లాన్ చేసుకుంటున్నారా..? వర్షాకాలంలో సంభవించే అవాంఛనీయ ఘటనలకు దూరంగా ఉంటూ.. శృంగార కౌగిలి( Romantic Life )లో ఒదిగి పోవాలనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం మరి.. ఈ ప్రాంతాలకు వెళ్లి శృంగార జీవితం( Romantic Life )లో మధురానుభూతి పొందండి..

Honeymoon Spots | కొత్తగా పెళ్లైన జంటలు( Newly Married Couple ).. హనీమూన్( Honeymoon )కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఏకాంతంగా గడుపుతూ.. శృంగార జీవితం( Romantic Life )లో మధురానుభూతిని పొందాలని ప్రతి కొత్త జంట కలలు కంటోంది. అందుకు రమణీయతతో కూడిన ఆహ్లాదాన్ని పంచే ప్రదేశం ముఖ్యం. ప్రకృతి( Nature ) ఒడిలో ఒదిగిపోతూ.. చల్లని గాలులను ఆస్వాదిస్తూ.. శృంగార ప్రపంచం( Romantic Life )లో మునిగిపోవాలనుకునే కొత్త దంపతులకు.. టాప్ మాన్సూన్ స్పాట్స్( Top Monsoon Spots ) ఇవే. ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే.. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేయొచ్చు. జీవితంలో మరిచిపోలేని అనుభూతి పొందొచ్చు.. మరి ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం..
ఉదయ్‌పూర్ ( Udaipur )
ఉదయ్‌పూర్( Udaipur ).. రాజస్థాన్( Rajasthan )లోని ఒక చారిత్రక నగరం. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంతేకాకుండా వర్షాకాలంలో పొగమంచు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడున్న రాజభవనాలు ఆ పొగమంచులో మరింత రొమాంటిక్‌గా, సినిమాటిక్‌గా కనిపిస్తాయి. ఆ వెదర్లో నూతన దంపతులు విహారిస్తే ఆ ఎంజాయ్ వేరేనే ఉంటుంది. శృంగార విహారయాత్రకు ఉదయ్‌పూర్ ఓ మంచి హాట్‌స్పాట్ అని చెప్పొచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు : పిచోలా సరస్సులో పడవ ప్రయాణం, సిటీ ప్యాలెస్ చుట్టూ తిరిగేడయం, ఆరావళి వద్ద మేఘాలతో కూడిన దృశ్యాలు.. ఇవన్నీ కనువిందు కలిగిస్తాయి.
కూర్గ్ ( Coorg )
దక్షిణ భారతదేశంలోని అద్భుత పర్యాటక ప్రదేశం కూర్గ్( Coorg ). కాఫీ ఎస్టేట్( Coffee Estates )లతో కళకళలాడిపోతుంది. కర్ణాటక( Karnataka )లో ఉన్న కూర్గ్ ప్రాంతం అంతా వర్షాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సమయంలో కూర్గ్‌లో కొత్త జంటలు విహారిస్తే.. చక్కటి అనుభూతిని పొందొచ్చు. కాఫీ తోటల్లో విహారిస్తూ.. మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. చల్లని గాలులకూ ఫిల్టర్ కాఫీని తాగుతూ.. రొమాంటిక్ ఫీల్( Romantic Feel )ను ఎంజాయ్ చేయొచ్చు. అక్కడున్న ప్రకృతి కూడా పెళ్లైన ప్రేమికులను కట్టిపడేస్తుంది.
చూడాల్సిన ప్రదేశాలు : అబ్బే వాటర్ ఫాల్స్, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, టాలాకావేరి
మున్నార్ ( Munnar )
కేరళ( Kerala )లోని మున్నార్( Munnar ) కూడా వర్షాకాలంలో ఎంతో ఆకర్షిస్తోంది. తేయాకు తోటలన్నీ పొగమంచుతో కప్పబడి ఉంటాయి. ఆ చల్లని గాలులకు, ఆ ప్రకృతి రమణీయతకు కొత్త జంటలు ఎవరైనా శృంగార కౌగిలిలో ఒదిగిపోవాల్సిందే. ప్రశాంత వాతావరణంలో ఎన్నో మధురానుభూతులు పొందొచ్చు. కొండలపై తేయాకు తోటల్లో విహారిస్తూ.. తెలియని అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు : ఎరవికులం నేషనల్ పార్క్, అట్టుకల్ వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్
లోనవాలా ( Lonavala )
ముంబై( Mumbai ), పుణె( Pune )కు అతి సమీపంలో ఉన్న హాట్ స్పాట్ లోనవాలా ( Lonavala ). వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా.. పచ్చగా మారుతుంది. జలపాతాలు మనసును కట్టి పడేస్తాయి. లోనవాలా అంతా సినిమాటిక్‌గా, రొమాంటిక్‌గా ఉంటుంది. నూతన దంపతులు తెలియని ఊహాల్లో విహారించొచ్చు.
చూడాల్సిన ప్రదేశాలు : భూషి డ్యామ్, టైగర్ లీప్, పావ్నా లేక్, కర్లా అండ్ భజా కేవ్స్, లోహగడ్ ఫోర్ట్.
షిల్లాంగ్ ( Shillong )
నూతన దంపతులకు షిల్లాంగ్ ( Shillong ) కూడా మంచి పర్యాటక ప్రదేశం. కొండలు కొత్త అనుభూతిని ఇస్తాయి. జలపాతాలు మనసును పులకింపజేస్తాయి. సరస్సులు కనువిందు చేస్తాయి. ఇవన్నీ నూతన జంటలకు తెలియని మధురానుభూతిని ఇస్తూ.. మనసులను ఏకం చేస్తాయి.
చూడాల్సిన ప్రదేశాలు : ఉమియం లేక్, లైట్లమ్ కానయాన్స్, షిల్లాంగ్ పీక్, డాన్ బాస్కో మ్యూజియం, మ్యాజికల్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్.
కొడైకెనాల్ ( Kodaikanal )
తమిళనాడు( Tamil Nadu )లోని కొడైకెనాల్( Kodaikanal ) నిత్యం పర్యాటకులను( Tourists ) ఎంతో కనువిందు చేస్తుంది. పెళ్లైన జంటలకు కొడైకెనాల్ మంచి హనీమూన్( Honeymoon ) ప్లేస్. చల్లని గాలులు, ఉప్పొంగుతున్న జలపాతాలు( Water Falls ).. ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రేమ పక్షులను ఏకం చేస్తాయి. ప్రతి ప్రదేశం ఒక రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తుంది. సినిమాటిక్ రేంజ్లో రొమాంటిక్ ఫీల్‌ను పొందొచ్చు. పెళ్లైన జంటలే కాదు.. కుటుంబాలు కూడా కొడైకెనాల్ వెళ్లొచ్చు. అక్కడున్న వెదర్ నూతన జంటలకు ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది.
చూడాల్సిన ప్రదేశాలు : కొడైకెనాల్ లేక్, కూకర్ వాక్, పిల్లర్ రాక్స్, బెరిజామ్ లేక్, సిల్వర్ కాస్కేడ్ వాటర్ ఫాల్.