Encounter | కుల్గామ్ జిల్లాలో ఎన్కౌంటర్లు.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికుల వీరమరణం..!
Encounter | జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆయా ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు.

Encounter | జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆయా ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. మరో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. జిల్లాలోని రెండువేర్వేరు చోట్ల ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. మోడెర్గామ్ గ్రామంలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఓ ప్రదేశంలో దాక్కున్నారని సీఆర్పీఎఫ్, సైన్యం, స్థానిక పోలీసుల సంయుక్త బృందం తనిఖీలు మొదలుపెట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో ఓ సైనికుడు వీరమరణం పొందారు. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్లుగా అనుమానిస్తున్నారు. కుల్గామ్‌లోని ఫ్రిసల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్ జరిగింది. భీకర కాల్పుల్లో నలుగురు ఉగ్రాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరొకరికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఉగ్రవాదుల మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్కౌంటర్ స్థలంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. గత నెలలోలనే దోడా జిల్లా గండో ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.