నాలుగేండ్ల చిన్నారిపై ఎస్ఐ లైంగిక‌దాడి

రాజ‌స్థాన్‌లో షాకింగ్‌ ఘ‌ట‌న వెలుగుచూసింది. దౌసా జిల్లా లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం నాలుగేండ్ల‌ చిన్నారిపై పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

  • Publish Date - November 11, 2023 / 07:10 AM IST
  • రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం
  • కేసు న‌మోదు.. నిందితుడి అరెస్టు


విధాత‌: రాజ‌స్థాన్‌లో షాకింగ్‌ ఘ‌ట‌న వెలుగుచూసింది. దౌసా జిల్లా లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం నాలుగేండ్ల‌ చిన్నారిపై పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఎన్నికల విధుల్లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపేంద్ర సింగ్ మ‌ధ్యాహ్నం వేళ చిన్నారిని తన గదిలోకి లాక్కెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఏసీపీ రామచంద్ర సింగ్ నెహ్రా తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.


బాధితురాలి కుటుంబసభ్యుల ఆధారాల‌తోపాటు, వైద్య పరీక్షల అనంతరం బాధిత బాలిక కచ్చితమైన వయస్సును నిర్ధారిస్తామని దౌసా ఎస్పీ వందిత రాణా తెలిపారు. బాలిక వయస్సు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులకు అప్పగించే ముందు గ్రామ‌స్థులు భూపేంద్ర సింగ్‌ను చిత‌బాదారు.