Facebook Love | 100 కి.మీ. ప్ర‌యాణం.. 13 గంట‌ల దెబ్బ‌లు.. ఓ యువ‌కుడి ప్రేమ క‌థ ఇదీ..!

Facebook Love | ఓ యువ‌కుడి ఫేస్‌బుక్‌( Facebook )లో ఓ బాలిక‌ ప‌రిచ‌య‌మైంది. దీంతో ఆమెను క‌లిసేందుకు ఆ యువ‌కుడు పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఒక‌ట్రెండు కిలోమీట‌ర్లు కాదు.. ఏకంగా 100 కి.మీ. ప్ర‌యాణించాడు.

Facebook Love | 100 కి.మీ. ప్ర‌యాణం.. 13 గంట‌ల దెబ్బ‌లు.. ఓ యువ‌కుడి ప్రేమ క‌థ ఇదీ..!

Facebook Love | భోపాల్ : ఓ యువ‌కుడి ఫేస్‌బుక్‌( Facebook )లో ఓ బాలిక‌ ప‌రిచ‌య‌మైంది. దీంతో ఆమెను క‌లిసేందుకు ఆ యువ‌కుడు పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఒక‌ట్రెండు కిలోమీట‌ర్లు కాదు.. ఏకంగా 100 కి.మీ. ప్ర‌యాణించాడు. ఇక త‌న స్నేహితురాలిని( Girl Friend ) క‌ల‌వ‌బోతున్న ఆనందం అత‌నిలో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం క్ష‌ణాల్లోనే ఆవిరైపోయింది. మా అమ్మాయినే క‌ల‌వ‌డానికి వ‌స్తావా..? అంటూ అత‌నిపై ఆమె కుటుంబ స‌భ్యులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్( Madhya Pradesh ) రాష్ట్రంలో వెలుగు చూసింది.

రేవా జిల్లాలోని బైకుంత్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువ‌కుడికి ఫేస్‌బుక్‌లో పిప్ర‌హి గ్రామానికి చెందిన ఓ బాలిక ప‌రిచ‌య‌మైంది. ఇరువురు ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకునేవారు. అయితే ఆమెను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ యువ‌కుడు.. ఏకంగా 100 కిలోమీట‌ర్లు ప్రయాణించాడు. బాలిక ఇంటి స‌మీపంలో వాలిపోయాడు. ఇక ఆమెను క‌ల‌వ‌బోయే స‌మ‌యానికి కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి అత‌న్ని నిర్బంధించారు.

ఓ చెట్టుకు క‌ట్టేశారు. 13 గంట‌ల పాటు అత‌న్ని హింసించారు. తీవ్రంగా కొట్టారు. గ‌త శ‌నివారం రాత్రి 9 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఆ యువ‌కుడిని క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. ఘోరంగా కొడుతూ అవ‌మానించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

అయితే ఈ ఘ‌ట‌న‌పై త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేని ఎస్పీ ఆర్ఎస్ ప్ర‌జాప‌తి పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వీడిను చూశాం. పూర్తిస్థాయి ఆధారాలు సేక‌రించి, చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించిన‌ట్లు ఎస్పీ చెప్పారు.