• Telugu News
  • /National

అరాచకం..వ్యక్తిపై ఒడిస్సాలో మూక దాడి !

ఒడిస్సాలో ఓ వ్యక్తిని తలకిందులుగా కట్టి మూకదాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | May 07, 2026, 6:17 pm IST
Read Time: 3 mins
అరాచకం..వ్యక్తిపై ఒడిస్సాలో మూక దాడి !

ఆధునిక ప్రజాస్వామ్యయుత నాగరికత సమాజంలోనూ మూక దాడుల ఘటనలు పాత కాలం నాటి రోజులను తలపిస్తున్నాయి. అదికూడా ప్రజాస్వామ్య సౌధంగా పిలుచుకునే భారత దేశంలో జరుగడం కలకలం రేపింది. ఒడిస్సాలో ఓ భవనాల నిర్మాణాల ప్రాంతంలో ఓ వ్యక్తిని బంధించి కర్రకు తలకిందులుగా కట్టివేసి కొడుతూ.. ఒక ట్రక్కు పైకి మోసుకెళ్తున్న దృశ్యం వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన మూక హింసకు నిదర్శనంగా కనిపిస్తుంది.

ఈ దుస్సంఘటనను లౌకిక వాద పాత్రికేయుడిగా గుర్తింపు పొందిన అమియా పాండవ్ ఎక్స్ లో పోస్టు చేశారు. అధికార బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్ రాజకీయ విజయాన్ని జల్మురితో జరుపుకుంటుండగా, రాష్ట్రంలోని బీజేపీ “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం అరాచకానికి అనుమతిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో వలస కార్మికులపైన, సామాన్యులపైన ఒడిశాలో పదేపదే జరుగుతున్న మూక దాడులు సాధారణంగా మారిపోయాయని పాండవ్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ
తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్‌ వద్దకు విజయ్