ఎయిర్ ఇండియా మరో మిస్టేక్..శాకాహార భోజనంలో చికెన్ వడ్డించారు!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బంది పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. కాలికట్-ముంబై విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలికి శాఖాహార

- సోషల్‌మీడియాలో ఫుడ్ వీడియో పోస్టు
- విమానయాన సంస్థపై నెటిజన్ల మండిపాటు
విధాత: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బంది పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. కాలికట్-ముంబై విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలికి శాఖాహార భోజనంలో చికెన్ ముక్క రావడంపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఇటీవల ఎయిర్ ఇండియాకు చెందిన కాలికట్-ముంబై విమానంలో శాకాహారి అయిన వీర జైన్.. ప్రయాణించారు. కాలికట్ నుంచి సాయంత్రం 6.40 టేకాఫ్ కావాల్సిన విమానం.. గంట ఆలస్యంగా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. చాలా ఆకలితో ఉన్న తాను సిబ్బందికి వెన్ భోజనం ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చారు. దానిని తెరిచి చూడగా ఆలుగడ్డ కూరలో చికెన్ ముక్క కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని బాధితురాలు క్యాబిన్ సూపర్‌వైజర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె క్షమాపణ చెప్పారు. కానీ, ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనతోపాటు తన స్నేహితురాలికి కూడా పలుమార్లు ఇదే తరహా పరిస్థితి ఎదురైందని, అయినా, సంస్థ పనితీరులో ఎలాంటి మార్పు లేదని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు వీరజైన్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్‌చేశారు. విమానయాన సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విమానం ఆలస్యం కావడం వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినట్టు పేర్కొన్నారు. సంస్థ పనితీరుపై నెటిజన్లు ఫైరయ్యారు. పలువురు పలు విధాలుగా స్పందించారు.