మరో ఎన్నికల సమరం….

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల నిర్వాహణలో భాగంగా జూలై 10న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు

 మరో ఎన్నికల సమరం….

ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

13 స్థానాలకు జూలై 10న పోలింగ్‌..13న ఓట్ల లెక్కింపు

విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల నిర్వాహణలో భాగంగా జూలై 10న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. బెంగాల్‌లో 4అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 2, పంజాబ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 3స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి జూన్ 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ వేసేందుకు చివరి తేదీ జూన్ 21 కాగా… జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 26గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూలై 10న ఓటింగ్ నిర్వహించి, జూలై 13న ఫలితాలు వెల్లడించనున్నారు.