బ్యాంకు పనులుంటే వెంటనే చేసుకోండి..! నవంబర్‌లో 15 రోజులు సెలవులే..!

బ్యాంకు పనులుంటే వెంటనే చేసుకోండి..! నవంబర్‌లో 15 రోజులు సెలవులే..!

నవంబర్‌లో బ్యాంకులు ఏకంగా 15 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. ముందస్తుగా సమాచారం లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని నవంబర్‌లో బ్యాంకులు పక్షం రోజులు మూతపడనున్నాయి.


అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేలతో పాటు యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్ల కోసం మెషిన్లను సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.


సెలవుల జాబితా ఇదే..

నవంబర్‌ 1 : కన్నడ రజతోత్సవం. కర్వా చౌత్​. బెంగళూరు, ఇంఫాల్‌, సిమ్లాలో బ్యాంకులకు సెలవులు.

నవంబర్​ 5 : ఆదివారం కావడంతో మూసివేత.

నవంబర్​ 10 : వంగాల పండుగ సందర్భంగా షిల్లాంగ్​లోని బ్యాంకులకు సెలవు.

నవంబర్​ 11 : రెండో శనివారం సందర్భంగా సెలవు.

నవంబర్​ 12 : ఆదివారం సెలవు.

నవంబర్​ 13 : దీపావళి పండుగ సందర్భంగా అగర్తలా, డెహ్రాడూన్​, గ్యాంగ్​టక్​, ఇంఫాల్​, జైపూర్​, కాన్పూర్​, లక్నోలో బ్యాంకుల మూసివేత.

నవంబర్​ 14 : దీపావళి బలిప్రాతిపదతో అహ్మదాబాద్​, బేలాపూర్​, బెంగళూరు, గ్యాంగ్​టక్​, ముంబయి, నాగ్‌పూర్‌లో సెలవులు.

నవంబర్​ 15 : లక్ష్మీ పూజ సందర్భంగా గ్యాంగ్​టక్​, ఇంఫాల్​, కాన్పూర్​, కోల్​కతా, లక్నో, సిమ్లాలో హాలిడే.

నవంబర్​ 19 : ఆదివారం సెలవు.

నవంబర్​ 20 : ఛత్​ పూట సందర్భంగా పాట్నా, రాంచీలో బ్యాంకుల మూసివేత.

నవంబర్​ 23 : సెంగ్​ కుట్సునెమ్​. డెహ్రాడూన్​, షిల్లాంగ్​ సెలవు.

నవంబర్​ 25 : నాలుగో శనివారం సెలవు.

నవంబర్​ 26 : ఆదివారం సెలవు.

నవంబర్​ 27 : గురునానక్​ జయంతి. అహ్మదాబాద్​, ఆంధ్రప్రదేశ్​, ఇంఫాల్​ మినహా మిగతా ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత.

నవంబర్​ 30 : కనకదాస జయంతి. బెంగళూరులోని బ్యాంక్​లకు హాలిడే.