రాజ‌స్థాన్ బీజేపీదే!.. లోక్‌పోల్ తాజా స‌ర్వేలో వెల్ల‌డి

రాజ‌స్థాన్ బీజేపీదే!.. లోక్‌పోల్ తాజా స‌ర్వేలో వెల్ల‌డి

న్యూఢిల్లీ : రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో బీజేపీ విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని లోక్‌పోల్ సంస్థ తెలిపింది. దాదాపు నెల‌రోజుల‌పాటు నిర్వ‌హించిన ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ త‌ర్వాత తాము ఈ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు పేర్కొన్న‌ది. ఈ స‌ర్వేలో బీజేపీ 96 నుంచి 108 సీట్ల మ‌ధ్య గెలుచుకునే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది. కాంగ్రెస్‌కు క‌నిష్ఠంగా 80, గ‌రిష్ఠంగా 92 సీట్లు రావ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. ఇక ఇత‌రులు 12 నుంచి 18 మ‌ధ్య సీట్ల‌ను గెలుచుకుంటార‌ని వివ‌రించింది.


బీజేపీకి 43% నుంచి 46% మ‌ధ్య ఓట్లు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ద‌ని లోక్‌పోల్ తెలిపింది. కాంగ్రెస్‌కు 41% నుంచి 43% మ‌ధ్య ఓట్లు ల‌భిస్తాయ‌ని స‌ర్వే అంచ‌నా వేసింది. ఇత‌రులు 13% నుంచి 15 శాతం మ‌ధ్య ఓట్లు తెచ్చుకునే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది.రాజ‌స్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు అవ‌స‌రం. ఈ స‌ర్వే కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 27,250 న‌మూనాల‌ను సేక‌రించిన‌ట్టు తెలిపింది.