ఏం ధైర్యం రా బాబు.. న‌ట్టింట్లో న‌ల్ల నాగుపాముకు ప్ర‌త్యేక పూజ‌లు.. వీడియో

నాగుపాము అంటే గుండెలు ఆగిపోతాయి. మ‌రి అలాంటి నాగుపాముకు న‌ట్టింట్లో ప్ర‌త్యేక పూజ‌లు చేసింది ఓ కుటుంబం. ఆ న‌ల్ల నాగుపాము ప‌డ‌గ‌విప్పి బుస‌లు కొడుతున్న స‌మ‌యంలోనే ప్ర‌త్యేక పూజ‌లు చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఆ కుటుంబం.

ఏం ధైర్యం రా బాబు.. న‌ట్టింట్లో న‌ల్ల నాగుపాముకు ప్ర‌త్యేక పూజ‌లు.. వీడియో

పాములంటేనే అంద‌రూ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతారు. అందులో నాగుపాము అంటే గుండెలు ఆగిపోతాయి. మ‌రి అలాంటి నాగుపాముకు న‌ట్టింట్లో ప్ర‌త్యేక పూజ‌లు చేసింది ఓ కుటుంబం. ఆ న‌ల్ల నాగుపాము ప‌డ‌గ‌విప్పి బుస‌లు కొడుతున్న స‌మ‌యంలోనే ప్ర‌త్యేక పూజ‌లు చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఆ కుటుంబం. న‌ట్టింట న‌ల్ల నాగుపాముకు పూజ‌లు చేసిన‌ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఆ కుటుంబ స‌భ్యులంద‌రూ న‌ట్టింట్లో కూర్చున్నారు. చిన్న పిల్ల‌ల నుంచి మొద‌లుకుంటే వృద్దుల వ‌ర‌కు నాగుపాము చుట్టూ కూర్చొని ప్ర‌త్యేక పూజ‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక ఆ నాగుపాముకు ఓ ప‌రిక‌రం సాయంతో పాలాభిషేకం చేశారు. ఆ న‌ల్లటి నాగుపాము ప‌డ‌గ‌విప్పి బుస‌లు కొడుతోంది. ఆ బుసలు కొడుతున్న నాగును చూసి కొంద‌రు భ‌య‌ప‌డిపోయారు. అది ఒకానొక ద‌శ‌లో కాటేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా, పూజ‌లో కూర్చున్న దంప‌తులు కొంచెం వెన‌క్కి క‌దిలారు. ఓ పెద్దాయ‌న కూడా అలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. అయితే ఆ పాము కాటేయ‌కుండా.. పాములు ప‌ట్టే వ్య‌క్తి జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు వీడియోలో స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరు ఆ ఫ్యామిలీ ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని విమర్శించారు.