• Telugu News
  • /National

CCPA Warns Restaurants : హోటళ్లు, రెస్టారెంట్‌లకు సీసీపీఏ వార్నింగ్

హోటళ్లు, రెస్టారెంట్లు LPG, ఇంధన పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని CCPA హెచ్చరించింది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 25, 2026, 6:26 pm IST
Read Time: 2 mins
CCPA Warns Restaurants : హోటళ్లు, రెస్టారెంట్‌లకు సీసీపీఏ వార్నింగ్

విధాత : ఎల్పీజీ, ఇంధన కొరతల పేరుతో అదనపు చార్జీలు వసూళ్లపై ‘సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ’(ccpa) సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ లకు ‘సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ’ (CCPA) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అదనపు ఛార్జీలు వసూలు చేస్తే వినియోగదారులు నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1915కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఆధారాలు చూపించేందుకు బిల్లు ఫొటో కాపీని దగ్గర ఉంచుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి :

విప్ప సారాకు ఇందిరమ్మ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ
LPG Refill Booking Rules : ఎల్పీజీ బుకింగ్ లో నో చేంజేస్ : కేంద్రం కీలక ప్రకటన