దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలపై యువతలో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఖాతాను భారత్‌లో ‘ఎక్స్’ నిలిపివేసింది. అకౌంట్ ప్రారంభించిన అనతికాలంలోనే ఇన్‌స్టాలో 14 మిలియన్ల యూజర్లను ఈ పేజీ సొంతం చేసుకుంది. ఏకంగా బీజేపీ ఇన్ స్టా ఫాలోవర్స్ ను సైతం దాటేసి రాజకీయంగా సంచలనం రేపింది. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ (కాక్‌రోచెస్, పారాసైట్స్) అనే వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే ఆ వ్యాఖ్యలపై నిరసిస్తూ ఒక వినూత్న వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా అభిజీత్ డిప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)ని సెటైరికల్ గా ప్రారంభించారు. ఆ వెంటనే సీజేపీ పార్టీకి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. ప్రతిపక్ష టీఎంసీ, ఆప్ పార్టీ ప్రజాప్రతినిధులు సీజేపీకి మద్దతు తెలిపారు. రోజురోజుకు మిలియన్ల ఫాలోవర్లను సాధిస్తున్న సీజేపీ పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపివేయడం చర్చనీయాంశమైంది. ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే సీజేపీకి చెందిన ఇన్‌స్టా ఖాతాను 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండటం గమనార్హం. సీజేపీ పేరిట వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
బీజేపీని దాటిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫాలోవర్స్
ఇండియాలో GenZ.. ఉద్యమం రానుందా?
