Deer’s Fight | భారత్‌ – పాక్‌ సరిహద్దుల్లో రెండు జింకల మధ్య యుద్ధం.. ఆ వీడియోను ఓసారి చూసేయండి మరి..!

Deers Fight | దాయాది దేశం పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతూ భారత్‌ను రెచ్చగొడుతూ ఉంటుంది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తూ దేశంలో దాడులకు తెగబడేందుకు ప్రయత్నిస్తూ వస్తుంటుంది. భారత బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముష్కర మూకలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వస్తున్నారు.

Deer’s Fight | భారత్‌ – పాక్‌ సరిహద్దుల్లో రెండు జింకల మధ్య యుద్ధం.. ఆ వీడియోను ఓసారి చూసేయండి మరి..!

Deer’s Fight | దాయాది దేశం పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతూ భారత్‌ను రెచ్చగొడుతూ ఉంటుంది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తూ దేశంలో దాడులకు తెగబడేందుకు ప్రయత్నిస్తూ వస్తుంటుంది. భారత బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముష్కర మూకలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వస్తున్నారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో భారత్‌ – పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల మధ్య కాల్పులతో పాటు చొరబాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పాక్‌ – భారత్‌ సరిహద్దుల్లో రెండు జింకలు సైతం కయ్యానికి కాలుదువ్వాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సరిహద్దులకు ఆవల ఉన్న రెండు జింకలు కుమ్ముకున్నాయి. రెండు జింకలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. బీఎస్ఎఫ్ ఆఫీసర్ జింకల కొట్లాటకు సంబంధించిన వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. తెగ వైరల్‌ అవుతున్నది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ చూసినట్లుగా ఉందని కామెంట్స్‌ చేశారు. మరికొందరు తెగ్గేదెలా.. పాక్‌కు గట్టిగాను జింక బుద్ధి చెప్పిందంటూ కామెంట్‌ చేశారు. నోరు లేని జీవాలు సైతం కవ్విస్తే ఊరుకోవంటూ స్పందించారు. మరి మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.