Delhi Liquor Scam | కస్టడీలో ఉన్న వ్యక్తి సీఎం పదవిలో కొనసాగడం సరికాదు..! : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రస్తోగి

  • By: Tech |    national |    Published on : Apr 03, 2024 11:10 AM IST
Delhi Liquor Scam | కస్టడీలో ఉన్న వ్యక్తి సీఎం పదవిలో కొనసాగడం సరికాదు..! : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రస్తోగి

Delhi Liquor Scam | కస్టడీలో ఉన్న వ్యక్తి పదవిలో కొనసాగడం సరికాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ రస్తోగి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోరి ఆర్టికల్‌ 8, 9 ప్రజాపాతినిధ్య చట్టం అనర్హతకు సంబంధించినవని తాను నమ్ముతున్నానన్నారు. ఢిల్లీ జైలు నిబంధనల్లో అనేక ఆంక్షలు ఉన్నాయని.. వాటి ప్రకారం ప్రతి రకమైన కాగితం జైలు సూపరింటెండెంట్ కళ్లకుండా వెళ్లాల్సిందేనని.. సూపరింటెండెంట్ అనుమతి తర్వాత మాత్రమే మీరు ఏదైనా కాగితంపై సంతకం చేయవచ్చన్నారు. చట్టసభ సభ్యులు ఇలాంటి ఆంక్షలు విధించిన సమయంలో.. ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు తన స్థానంలో కొనసాగవచ్చా ? అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నానన్నారు. ముఖ్యమంత్రి వంటి పెద్ద పదవిలో ఉన్నారని, అది ప్రజా పదవి అన్న ఆయన.. కస్టడీలో ఉంటే నా దృష్టిలో మీరు పదవిలో ఉండటం సముచితం కాదన్నారు.

ప్రజా నైతికత మీరు తప్పకుండా పదవి నుంచి వైదొలగాలని కోరుతుందని.. ఈ విషయంలో మనం గతంవైపు కూడా చూడాలన్నారు. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, ఇటీవల హేమంత్ సోరెన్ అందరూ రాజీనామా చేశారు. జైలుకు తీసుకెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి సంతకం చేయించడానికి వీల్లేదని.. అందువల్ల నైతికతలో భాగంగా రాజీనామా చేయాలని నేను బలంగా నమ్ముతున్నానన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని 48 గంటల పాటు నిర్బంధించి.. అతని నిర్బంధం అర్హతలను ఎవరూ చర్చించకపోతే.. అతను సస్పెన్షన్‌లో ఉన్నట్లుగా పరిగణించబడుతుందన్నారు. మీరు ఇంతకాలం జైలులో ఉన్నారు.. ఎంతకాలం ఉంటారో దేవుడికే తెలుసు.. దీనికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు లేనంత మాత్రాన పదవిలో కొనసాగే హక్కు మీకు లభించిందన్నారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.