ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై !

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హంగ్ ఏర్పడటం..విజయ్ టీవీకే పార్టీకి మద్దతుపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహించిన డీఎంకే పార్టీ ఇండియా కూటమికి గుడ్ బై కొట్టింది.

విధాత :  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హంగ్ ఏర్పడటం..విజయ్ టీవీకే పార్టీకి మద్దతుపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహించిన డీఎంకే పార్టీ ఇండియా కూటమికి గుడ్ బై కొట్టింది.  సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) – కాంగ్రెస్ కూటమి 55 ఏళ్ల బంధానికి తెరదించుతూ డీఎంకే కాంగ్రెస్ తో పొత్తును తెగతెంపులు చేసుకుంది.

కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లుగా డీఎంకే ప్రకటించింది. తమకు లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు. కాంగ్రెస్‌ ఎంపీల పక్కన కూర్చోలేమని అందులో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు తెలపడంతో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని వెన్నుపోటుగా, అవకాశవాదంగా డీఎంకే అభివర్ణించింది. ఇక ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి లేదని డీఎంకే స్పష్టం చేసింది. ఈ పరిణామంతో తమిళనాడులో పొత్తుల సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

Latest News