వచ్చేనెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు!

- లేదంటే డిసెంబర్ మొదటివారంలో
- ఎన్నికల సంఘం వర్గాల వెల్లడి
విధాత: తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం (ఐదు) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మిడ్ నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ మధ్య ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్ననేపథ్యంలో శుక్రవారం సమావేశాన్ని ఈసీ సమావేశమైంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తున్నది.
కమిషన్ ఇప్పటివరకు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను ఏర్పాట్లను పరిశీలించింది. గురువారంతో తెలంగాణ పర్యటన ముగిసింది.