విధాత : క్రికెట్ బెట్టింగ్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న అనందంలో ఉన్న ఎస్‌ఐకి ఉద్యోగం ఊడిన సమాచారం షాక్ నిచ్చింది. మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌బాడ్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ సోమనాథ్ జెండే ఈనెల 10న విధుల్లో ఉండి ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్11 నిర్వహించిన బెట్టింగ్‌లో పాల్గొన్నాడు.
జెండే ఎంపిక చేసుకున్న జట్టు ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. విషయం తెలుసుకున్న జెండే కుటుంబం సంతోషంలో సంబరాలు చేసుకున్నారు. అయితే పోలీసులే బెట్టింగ్ చేయడంపై వివాదం రేగడంతో ఇరుకున పడిన పోలీస్ శాఖ దీనిపై విచారణ జరిపి సోమనాథ్ జెండేను సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణ బాధ్యలతను డీసీపీ స్వప్నా గోర్‌కి అప్పగించారు.