విధాత: మహారాష్ట్రలోని థానే జిల్లా బీవండి ప్రాంతంలోని పత్తి గిడ్డంగిలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం.. బీవండిలోని పత్తి గోదాములో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే వివిధ అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు శకటాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.