వరదల్లో గ్యాస్ సిలిండర్లు.. ఎత్తుకెళ్లిన జనం !

పశ్చిమాసియా యుద్దంతో వంట గ్యాస్ కొరతతో గ్యాస్ సిలిండర్ల కోసం జనం ఎగబడటం..కొందరు ఏకంగా వాటి చోరీలకు పాల్పడటం చూశాం. అయితే యుద్ద పరిస్థితులలోనే కాదు..వరదల పరిస్థితులలోనూ జనం నదిలో కొట్టుకపోతున్న గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన ఘటన వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో రాయగఢ్‌లో హెచ్‌పీసీఎల్‌ బాట్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు చొచ్చుకరావడంతో ప్లాంట్ జలమయమైంది. దీంతో పాతాళగంగ నదిలో వరదల్లో 3,000 వరకు గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. నది ఒడ్డుకు చేరిన ఖాళీగా ఉన్న, నిండుగా గ్యాస్ సిలిండర్లను స్థానికులు దొరికనవాటిని దొరికినట్లుగా ఎత్తుకెళ్లారు.

అయితే గ్యాస్ లీకేజీ ప్రమాదాల దృష్ట్యా సిలిండర్లను తాకవద్దని,అక్కడి నివాసితులు ఎవరూ తీసుకెళ్లవద్దని, వాటి సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించాలని రాయగఢ్‌ జిల్లా కలెక్టర్‌ ప్రజలను హెచ్చరించారు.

Latest News