మ‌హిళా షూలోకి దూరిన పిల్ల నాగుపాము.. ప‌డ‌గ విప్పి హంగామా

  • Publish Date - October 10, 2023 / 07:36 AM IST

విధాత‌: నాగుపాలు విష‌పూరిత‌మైన‌వి. ఈ పాములు కాటేస్తే.. క్ష‌ణాల్లోనే మ‌న‌షులు ప్రాణాలు కోల్పోతారు. అందుకే నాగుపాములు క‌నిపిస్తే చాలు.. ప‌రుగెడుతుంటారు. ఇండ్ల‌లోకి ప్రవేశిస్తే చంపేస్తుంటారు. అలా నాగుపాముల నుంచి ర‌క్ష‌ణ పొందుతుంటారు. అయితే ఓ పిల్ల నాగుపాము మ‌హిళా షూలోకి దూరింది. ఆ త‌ర్వాత అది బుస‌లు కొడుతూ ప‌డ‌గ‌విప్పి హంగామా సృష్టించింది. కాటేసేందుకు య‌త్నించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.