మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ క్రిడిట్‌కార్డులున్నాయా..? ఈ నిబంధనలు మారాయని తెలుసా..?

మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ క్రిడిట్‌కార్డులున్నాయా..? ఈ నిబంధనలు మారాయని తెలుసా..?

దేశీయ ప్రముఖ దేశీయ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన రెండు క్రెడిట్‌కార్డుల నిబంధనలను మార్చి వేసింది. బ్యాంకుకు చెందిన పలు క్రెడిట్‌కార్డులకు మంచి ఆదరణ ఉన్నది. ఈ కార్డుల్లో రెగాలియా, మిలీనియా కార్డులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ రెండుకార్డుల యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ప్రస్తుతం ఈ రెండు కార్డులకు సంబంధించిన రూల్స్‌ను బ్యాంకు మార్చివేసింది. కార్డుల లాంజ్‌ యాక్సెస్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధనలు డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రెండు కార్డుల్లో ఏం రూల్స్‌ మారాయి.. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..!


రెగాలియా క్రెడిట్ కార్డు


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెగాలియా కార్డుకు సంబంధించి నిబంధనలను మార్చగా.. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు స్పెండ్‌ చేసేదాన్ని బట్టి మాత్రమే ఇకపై లాంజ్‌ యాక్సెస్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. ఏదైనా ఇయర్‌ క్వార్టర్‌లో (జనవరి-మార్చి, ఏప్రిల్‌-జూన్‌, జులై – సెప్టెంబర్‌, అక్టోబర్‌-డిసెంబర్‌) వరకు రూ.లక్ష లేదంటే అంతకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరితేనే లాంచ్‌ యాక్సెస్‌ ఉంటుంది.


లక్ష్యం చేరితే క్వార్టర్లీ మైల్‌స్టోన్ బెనిఫిట్స్ కింద గరిష్ఠంగా రెండు 2 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వోచర్లు అందుతాయి. ఒక వీటిని ఎలా వినియోగించాలంటే.. leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Regalia_Priority_Pass1/Regalia_Priority_Pass.aspx పేజీలోకి వెళ్లి వెళ్లాలి. అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి వోచర్‌ను జనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌, మేయిల్‌ ద్వారా వోచర్‌కు సంబంధించిన వివరాలు అందుతాయి.


హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డు


హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డులోనూ నిబంధనలను మారాయి. ఇందులోనూ స్పెండింగ్‌ను బట్టి లాంజ్‌ యాక్సెస్‌ ఆధారపడి ఉంది. త్రైమాసికంలో రూ.లక్షకు మించి ఖర్చు చేయాల్సి ఉటుంది. స్పెండింగ్‌ లిమిట్‌ను చేరుకుంటే.. బెనిఫిట్స్‌ కింద ఒక కాంప్లిమెంటరీ వోచర్‌ లభిస్తుంది. గెరాలియా కార్డ్‌ తరహాలోనే వోచర్‌ను జనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మొబైల్‌, మేయిల్‌కు కన్ఫర్మేషన్‌ మెస్సేజ్‌, వోచర్‌కు సంబంధించని వివరాలు అందుతాయి.