హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం..లోయలో పడిపోయిన కారు

హిమాచల్ ప్రదేశ్‌లో కారు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. అతివేగం కారణంగా జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది.

హిమాచల్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఓ కొండ మూల మలుపులో వేగంగా వెలుతున్న కారు..అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చింత్‌పూర్ణి జిల్లా ఊనా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి దాదాపు 200 అడుగుల లోతుకు పడి మంటలు చెలరేగాయి. లుధియానాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది.
డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు అంటున్నారు. రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న వాహనాలను, మలుపును అంచనా వేయకుండా వేగంగా కారు నడపడంతో ప్రమాదం చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు వైరల్ గా మారాయి.

ప్రమాద ప్రాంతంలో రోడ్డు మలుపు వద్ద ఎలాంటి రక్షణ గోడ, సేఫ్టీ బారియర్స్ లేకపోవడంతో ప్రమాదానికి కారణమైనట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొండ ప్రాంతాల్లోని రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

‘కోహినూర్‌ వజ్రం’ను భారత్ కు ఇవ్వాల్సిందే: న్యూయార్క్ మేయర్
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

Latest News